Karnataka: చెట్టుకు కట్టేసి, ప్రైవేట్ భాగాలపై ఎర్ర చీమలు.. గిరిజన బాలుడికి చిత్రహింసలు..

  • కర్ణాటక దావణగెరె జిల్లాలో దారుణం..
  • హక్కీ-పిక్కీ గిరిజన బాలుడికి చిత్రహింసలు..
  • దొంగతనం ఆరోపణలపై చెట్టుకు కట్టేసి, ప్రైవేట్ భాగాలపై చీమలు..
Karnataka

Karnataka

Karnataka: కర్ణాటక దావణగెరె జిల్లాలో దారుణం జరిగింది. సొంత కమ్యూనిటీకి చెందిన సభ్యులే దొంగతం ఆరోపణలో ఓ బాలుడిని చిత్రహింసలు పెట్టారు. మంగళవారం వెలుగులోకి వచ్చిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అయింది. బాధితుడిని చన్నగిరి తాలూకా నల్లూర్ సమీపంలోని అస్తపనహళ్లీ గ్రామానికి చెందిన హక్కీ-పిక్కీ గిరిజన వర్గానికి చెందిన బాలుడిగా గుర్తించారు.

Read Also: Petrol price hike: సామాన్యుడికి షాక్.. దేశవ్యాప్తంగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు..

×
×
Ad

దొంగతనం ఆరోపణపై బాలుడిని చెట్టుకు కట్టేసి కొట్టారు. అతడి ప్రైవేట్ భాగాలపై ఎర్ర చీమలను వదిలి చిత్రహింసలు పెట్టారు. హింసించిన నిందితులు కూడా అదే గిరిజన సమూహానికి చెందిన వారు. బాలుడిపై దొంగతనం ఆరోపణలు వచ్చిన తర్వాత ఈ శిక్షను విధించారు. కొన్ని రోజుల క్రితం ఈ సంఘటన జరిగినప్పటికీ, వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రజల దృష్టిని ఆకర్షించింది. దీనిపై స్థానిక అధికారులు స్పందించారు. చన్నగిరి పోలీసులు గ్రామాన్ని సందర్శించి, పూర్తి నివేదిక అందించాలని జిల్లా ఎస్పీ ఉమా ప్రశాంత్ ఆదేశించారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరుగుతోందని ఆమె ధ్రువీకరించారు.