NTV Telugu Site icon

Earthquake: దేశ రాజధాని ఢిల్లీలో భూప్రకంపనలు.. జనాలు హడల్

Earthquake

Earthquake

పాకిస్థాన్‌ను భూప్రకంపనలు హడలెత్తించాయి. రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 5.8గా నమోదైంది. దీని ప్రభావం ఉత్తర భారత్‌పై తీవ్ర ప్రభావం చూపించింది. ఢిల్లీ-ఎన్‌సీఆర్, ఉత్తరప్రదేశ్‌, హర్యానా, పంజాబ్‌, జమ్మూ కాశ్మీర్‌, ఆఫ్ఘనిస్థాన్‌లో ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో ఈ ఘటన సంభవించింది. భూకంపం కేంద్రం పాకిస్థాన్‌లోని లయాహ్‌కు వాయువ్యంగా 29 కి.మీ దూరంలో సంభవించింది. పాకిస్థాన్‌లోని పెషావర్, ఇస్లామాబాద్, లాహోర్, భారతదేశంలోని ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, హర్యానా, పంజాబ్, జమ్మూ కాశ్మీర్‌లలో ప్రకంపనలు వచ్చినట్లు నెటిజన్లు పేర్కొన్నారు. అంతేకాకుండా ఆఫ్ఘనిస్తాన్ అంతటా భూకంపం సంభవించింది. దీంతో ప్రజలు హడలెత్తిపోయారు. ఏం జరుగుతుందో అర్థంకాక అయోమయం గురయ్యారు. భయంతో పరుగులు తీశారు.

ఇది కూడా చదవండి: Kolkata: సీఎం మమతతో చర్చలకు వైద్య విద్యార్థుల డిమాండ్లు ఇవే..!

పాకిస్తాన్‌లో 5.8 తీవ్రతతో భూకంపం వచ్చినట్లు జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ (జిఎఫ్‌జెడ్) తెలిపింది . భూకంపం 10 కిలోమీటర్ల (6.21 మైళ్లు) లోతులో ఉందని GFZ తెలిపింది. బుధవారం మధ్యాహ్నం 12:58 గంటలకు పాకిస్థాన్‌లో రిక్టర్ స్కేల్‌పై 5.8 తీవ్రతతో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. నష్టం వివరాలు ఇంకా తెలియలేదని చెప్పింది. మరిన్ని వివరాలు రావాల్సి ఉందని చెప్పింది.

ఇది కూడా చదవండి: Manoj- Lakshmi: మనోజ్ కి బిగ్ సర్‌ప్రైజ్ ఇచ్చిన మంచు లక్ష్మి.. షాక్ కి గురైన యంగ్ హీరో (వీడియో)

ప్రకంపనల సమయంలో సీలింగ్ ఫ్యాన్లు, కుర్చీలు, ఇతర వస్తువులు కొద్దిసేపు వణుకుతున్నట్లు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. రాజస్థాన్‌లోని బికనీర్‌కు చెందిన ఒక వ్యక్తి ఢిల్లీ NCRలో భారీ ప్రకంపనలు సంభవించాయని వ్యాఖ్యానించారు.

ఇది కూడా చదవండి: Manoj- Lakshmi: మనోజ్ కి బిగ్ సర్‌ప్రైజ్ ఇచ్చిన మంచు లక్ష్మి.. షాక్ కి గురైన యంగ్ హీరో (వీడియో)