Food Order Via WhatsApp: రైల్వే ప్రయాణికులు మరో గుడ్‌న్యూస్.. రైలు ప్రయాణీకులు త్వరలో వాట్సాప్ నంబర్ ద్వారా తమకు నచ్చిన, ఇష్టమైన ఆహారాన్ని ఆర్డర్ చేసుకునే వెసులుబాటు రానుంది.. ప్రయాణికుల సౌకర్యార్థం ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ).. ఇంటరాక్టివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్-ఎనేబుల్డ్ చాట్‌బోట్‌ను అందుబాటులోకి తెస్తున్నది. ఈ చాట్‌బోట్‌పై ప్రయాణికులు ఈ-కేటరింగ్, మీల్స్ బుకింగ్ కోసం చాటింగ్ చేయొచ్చు. ఇప్పటికే కొన్ని నిర్దిష్ట రూట్లలో ఐఆర్సీటీసీ.. +91 8750001323 ఫోన్ నంబర్‌పై వాట్సాప్ ద్వారా ఫుడ్ అందిస్తుండగా.. కస్టమర్ ఫీడ్‌బ్యాక్ మరియు సూచనల ఆధారంగా, కంపెనీ ఇతర రైళ్లలో కూడా దీన్ని ప్రారంభిస్తుంది అని రైల్వేశాఖ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపింది.
Read Also: Turkey Earthquakes: వరుసగా మూడు విధ్వంసకర భూకంపాలు.. 2,300 మందికి పైగా మృతి
ఐఆర్‌సీఐసీ ప్రత్యేకంగా అభివృద్ధి చేసిన వెబ్‌సైట్ www.catering.irctc.co.inతో పాటు ఈ-క్యాటరింగ్ యాప్ ‘ఫుడ్ ఆన్ ట్రాక్’ ద్వారా ఈ-కేటరింగ్ సేవలను ప్రారంభించిందని తెలిపింది. వాట్సాప్ ద్వారా ఈ-కేటరింగ్ సేవలను రెండు దశల్లో అమలు చేయాలని భావించారు. మొదటి దశ ఇప్పటికే అమలు చేయబడింది, దీని కింద, www.ecatering.irctc.co.inపై క్లిక్ చేయడం ద్వారా ఈ-కేటరింగ్ సేవలను ఎంచుకోవడానికి ఈ-టికెట్‌ను బుక్ చేసుకునే కస్టమర్‌లకు బిజినెస్ వాట్సాప్ నంబర్ సందేశాన్ని పంపుతుంది. యాప్‌ని డౌన్‌లోడ్ చేయాల్సిన అవసరం లేకుండానే నేరుగా ఐఆర్‌సీటీసీ యొక్క ఈ-కేటరింగ్ వెబ్‌సైట్ ద్వారా స్టేషన్లలో అందుబాటులో ఉన్న వారికి నచ్చిన రెస్టారెంట్ల నుండి వారికి నచ్చిన భోజనాన్ని బుక్ చేసుకోగలుగుతారు. ఇక, రెండో దశలో ఇంటరాక్టివ్ వాట్సాప్ మీల్ బుకింగ్, డెలివరీకి భారతీయ రైల్వేస్ ప్రణాళిక రూపొందించాయి. ఇందులో వాట్సాప్ నంబర్.. తమ కస్టమర్‌కు ఇంటరాక్టివ్ టూ వే కమ్యూనికేషన్ ప్లాట్‌ఫామ్ అందుబాటులోకి తేనుంది.. తమకు అవసరమైన మీల్‌ను ఏఐ-పవర్డ్ చాట్‌బోట్‌లోకి వెళ్లి బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ప్రతి రోజూ ఐఆర్సీటీసీ ఈ-కేటరింగ్ సర్వీస్ వెబ్‌సైట్, యాప్ ద్వారా దాదాపు 50 వేల మందికి భోజనం డెలివరీ చేస్తోంది రైల్వేశాఖ..