Site icon NTV Telugu

Mayawati: ఈసారి యూపీలో అధికారం మనదే.. 70వ బర్త్‌డే సందర్భంగా మాయావతి సందేశం

Mayawati

Mayawati

ఉత్తరప్రదేశ్‌లో తిరిగి అధికారంలోకి వస్తామని బీఎస్పీ అధినేత్రి మాయావతి ధీమా వ్యక్తం చేశారు. గురువారం 70వ పుట్టినరోజు జరుపుకున్నారు. ఈ సందర్భంగా లక్నోలో మాయావతి మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఎస్పీ, బీజేపీ, కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. ఈ పార్టీలకు తగిన సమాధానం ఇవ్వాలని పిలుపునిచ్చారు. రాబోయే రోజుల్లో ‘రాజ్యాంగ వ్యతిరేక’ బీజేపీని సవాల్ చేస్తూనే ఉంటానని పేర్కొన్నారు. ఈ సందర్భంగా తిరిగి బీఎస్పీ అధికారంలోకి రాబోతుందని కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. దేశ వ్యాప్తంగా బీఎస్పీని బలోపేతం చేయాలంటే.. యూపీలో అధికారంలోకి రావాల్సి ఉందని తెలిపారు.

సమాజ్‌వాదీ పార్టీ పాలనలో గూండాలు, మాఫియాలు, నేరస్థులు పాలించారని ఆరోపించారు. దళితులు అత్యంత దారుణంగా దోపిడీకి గురయ్యారని పేర్కొన్నారు. 1995లో ఎస్పీతో పొత్తు తెగిపోయినప్పుడు తనను చంపడానికి కూడా ప్రయత్నించారని ఆరోపించారు. వారి పాలనలో ముస్లింలు కూడా దోపిడీకి గురయ్యారని చెప్పారు.

మాయావతి నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా పని చేశారు. గురువారం 70వ బర్త్‌డే చేసుకుంటున్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఆమె అభిమానులు ‘‘ప్రజా సంక్షేమ దినోత్సవం’గా వేడుకలు జరుపుకుంటున్నారు. లక్నోకు పెద్ద ఎత్తున కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. ఇక మాయావతికి ముఖ్యమంత్రి యోగి ఆదిన్యనాథ్, ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.

 

Exit mobile version