NTV Telugu Site icon

Maharashtra: “ద్రోహం చేసిన నా కుమార్తె, అల్లుడిని ప్రాణహితలో పారేయండి”.. మంత్రి సంచలన వ్యాఖ్యలు..

Ncp Leader

Ncp Leader

Maharashtra: మహారాష్ట్ర ఆహార- ఔషధ నిర్వహణ శాఖ మంత్రి, ఎన్సీపీ (అజిత్ పవార్) సీనియర్ నేత ధర్మారావుబాబా ఆత్రమ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘ద్రోహం’’ చేసినందుకు తన కుమార్తె భాగ్యశ్రీ, అల్లుడు రితురాజ్ హల్గేకర్‌లను ప్రాణహిత నదిలో పారేయాలని అహేరి నియోజకవర్గ ఓటర్లు కోరారు. వీరిద్దరు శరద్ పవార్ ఎన్సీపీ వర్గంలో చేరేందుకు సిద్ధమవుతున్న తరుణంలో ఈయన ఈ వ్యాఖ్యలుచేశారు.

మహాయుతి(బీజేపీ-షిండే శివసేన- అజిత్ పవార్ ఎన్సీపీ) ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘‘ముఖ్యమంత్రి మాఝీ లడ్కీ బహిన్ యోజన’’ ప్రచార కార్యక్రమంలో భాగంగా అహేరీలో ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్ పాల్గొన్న సభలో ఆత్రమ్ ఈ వ్యాఖ్యలు చేశారు. తనపై పోటీ చేసేందుకు తన కుమార్తె ప్రత్యర్థి వర్గం ఎన్సీపీ(శరద్ పవార్)లో చేరుతున్నట్లు తెలుస్తోంది.

Read Also: Afzal Guru: “అఫ్జల్ గురుని ఉరితీయడం వల్ల లాభం లేదు”.. ఒమర్ అబ్దుల్లా వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్..

“ప్రజలు పార్టీని వీడిపోతారు కానీ వారిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నా రాజకీయ పలుకుబడిని ఉపయోగించి మా కుటుంబంలోని కొందరు వేరే పార్టీలో చేరాలనుకుంటున్నారు. 40 ఏళ్లుగా రాష్ట్ర రాజకీయాల్లో వారు ఫిరాయింపులకు పాల్పడ్డారు. ఇప్పుడు శరద్ పవార్ గ్రూపు నాయకులు నా ఇంటిని విభజించి నా కుమార్తెను నాపై పోటీకి దింపాలని చూస్తున్నారు. నా అల్లుడు మరియు కూతురిని నమ్మవద్దు,’’ అని ఓటర్లను కోరారు. ‘‘ నా కూతురు, అల్లుడు తనను వదిలిపెట్టారు వారిని ప్రాణహిత నదిలో పారేయవాలి. వారు నా కుమార్తెను తన నుంచి విడదీసి, నాకు వ్యతిరేకంగా పోటీ దింపుతున్నారు. తండ్రికి కూతురు కాలేని అమ్మాయి, మీకు ఏం చేస్తుంది..? మీరు దాని గురించి ఆలోచించాలి. ఆమెని నమ్మొద్దు. రాజకీయాల్లో తాను కూతురు, అల్లుడు, తమ్ము అని చూడను’’ అని అన్నారు.

ఒక కూతురు నన్ను వదిలేసిన, మరో కూతురు ఇతర కుటుంబ సభ్యులు తనతోనే ఉన్నారని ఆత్రం చెప్పుకొచ్చారు. గతేడాది ఎన్సీపీలో చీలిక వచ్చింది. శరద్ పవార్‌ని కాదని, అజిత్ పవార్ మహారాష్ట్రలో బీజేపీ-శివసేన షిండే వర్గంతో చేతులు కలిపారు. ఎక్కువ మంది ఎమ్మెల్యేలు, నాయకుల బలంల అజిత్ పవార్‌కే ఉండటంతో నిజమైన ఎన్సీపీని అజిత్ పవార్‌దే అని కేంద్ర ఎన్నికల సంఘం చెప్పింది.