Maharashtra: మహారాష్ట్ర ఆహార- ఔషధ నిర్వహణ శాఖ మంత్రి, ఎన్సీపీ (అజిత్ పవార్) సీనియర్ నేత ధర్మారావుబాబా ఆత్రమ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘ద్రోహం’’ చేసినందుకు తన కుమార్తె భాగ్యశ్రీ, అల్లుడు రితురాజ్ హల్గేకర్‌లను ప్రాణహిత నదిలో పారేయాలని అహేరి నియోజకవర్గ ఓటర్లు కోరారు. వీరిద్దరు శరద్ పవార్ ఎన్సీపీ వర్గంలో చేరేందుకు సిద్ధమవుతున్న తరుణంలో ఈయన ఈ వ్యాఖ్యలుచేశారు.