NTV Telugu Site icon

Encounter in Kupwara: జమ్మూకశ్మీర్‌లో మరోసారి కాల్పులు.. ఉగ్రవాది హతం, ముగ్గురు సైనికులకు గాయాలు..!

Firing

Firing

Encounter in Kupwara: జమ్మూకశ్మీర్‌లోని కుప్వారాలో భారత సైన్యం, పాక్‌ సైన్యం మధ్య ఎన్‌కౌంటర్‌ జరిగినట్లు తెలుస్తుంది. ఉత్తర కాశ్మీర్‌లోని నియంత్రణ రేఖపై మచల్ (కుప్వారా) సెక్టార్‌లో పాకిస్థాన్ ఆర్మీకి చెందిన బోర్డర్ యాక్షన్ టీమ్ (BAT) జరిపిన దాడిని భారత సైనికులు భగ్నం చేశారు. బీఏటీలో పాల్గొన్న ఒక ఉగ్రవాది మరణించాగా.. ముగ్గురు సైనికులు గాయపడ్డారు. పాకిస్తాన్ ఆర్మీకి చెందిన కమాండోలతో పాటు, పాకిస్తాన్ ఆర్మీకి చెందిన బాట్ టీమ్ స్క్వాడ్‌లలో అల్- బదర్, తెహ్రికుల్ ముజాహిదీన్, లష్కర్, జైష్ ఉగ్రవాదులు కూడా ఉన్నారు.

Read Also: Champions Trophy 2025: మేం చాలా మంచోళ్లం బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం: షోయబ్ మాలిక్

అయితే, మచ్చల్‌లో మిలటరీ ఆపరేషన్ కొనసాగుతోంది. ఇది పూర్తైన తర్వాతే బ్యాట్ యాక్షన్ లేదా చొరబాటు ప్రయత్నమా అనేది స్పష్టమవుతుంది. ఇవాళ (శనివారం) తెల్లవారుజామున, మచల్ సెక్టార్‌లోని కుంకడి ఫార్వర్డ్ పోస్ట్‌ వైపు వెళ్తున్న కొంతమందిని సైనికులు చూశారు.. దీంతో వారిని ప్రశ్నించగా.. పాక్ కు చెందిన బ్యాట్ స్క్వాడ్ కాల్పులు జరిపి వెనక్కి పరుగులు తీయడం ప్రారంభించింది. ఇండియన్ ఆర్మీ కూడా ఎదురుకాల్పులు జరిపారు. దాదాపు మూడు గంటల పాటు ఇరువైపులా కాల్పులు కొనసాగాయి. బీఏటీ దాడిని విఫలం చేస్తుండగా ముగ్గురు సైనికులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. బీఏటీకి చెందిన ఒక సభ్యుడి కూడా భారతీయ సైనికులు చంపేశారు. కానీ అతని శరీరం ఎల్ఓసీలోనే పాకిస్తానీ సైన్యం యొక్క డైరెక్ట్ ఫైరింగ్ రేంజ్‌లో పడిపోయింది.