రైతుల సుదీర్ఘ పోరాటం ఫలించింది: సురవరం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రధాని నరేంద్రమోడీ 2019లో రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతో దూకుడుగా వ్యవసాయాన్ని నిర్వీర్యం చేసే విధంగా మూడు వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చారు. ఈ మూడు నల్ల చట్టాల ను రద్దు చేయాలని కోరుతూ.. దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లోనే కొన్ని నెలలుగా రైతులు ఉద్యమం చేస్తున్న విషయం తెల్సిందే.. అయితే ప్రధాని నరేంద్రమోడీ శుక్రవారం ఆ వ్యవసాయ చట్టాలను ఉపసం హరించుకుంటున్నట్టు ప్రకటించారు. వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తూ.. మోదీ ప్రకటించడంతో… ఈ దేశ రైతుల సుదీర్ఘ పోరాటం ఫలించిందని సీపీఐ సీనియర్ నాయకులు సురవరం సుధాకర్‌రెడ్డి పేర్కొన్నారు. వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని రైతులు శాంతి యుతంగా చేస్తున్న ఉద్యమాన్ని చెదరగొట్టేందుకు కేంద్రం ఎన్నో కుట్రలు చేసిందన్నారు. ఈ సందర్భంగా రైతుల పోరాటంలో 700 మంది ప్రాణాలు కోల్పోయారని గుర్తు చేశారు.
ఇన్ని నెలలుగా రైతులపై కర్కశంగా వ్యవహరించినందుకు.. రైతులకు మోదీ క్షమాపణ చెబితే సరిపోదు… చనిపోయిన రైతు కుటుంబాలకు నష్టపరిహారం ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. కాగా, వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకున్నట్టే… ప్రభుత్వ రంగ సంస్థల ఆస్తుల ప్రైవైటీకరణను కూడా ఆపాలన్నారు. అలాగే కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లను ఉపసంహరించుకోవాలని, చమురు ధరలు కూడా తగ్గించాలని డిమాండ్ చేశారు. దేశానికి ప్రమాదంగా ఉన్న మతోన్మాదుల మూర్ఖపు దాడులను అదుపులో పెట్టాలని సురవరం సుధాకర్‌రెడ్డి సూచించారు.
Also Read
- Mahant Rajudas: మోడీ జీ, అలాంటి జెన్-జీపై చర్యలు తీసుకోండి.. సీజేపీపై మహంత్ రాజూదాస్ ఆగ్రహం..
- Abhijeet Dipke: ‘‘సంతకం చేయలేదు, మళ్లీ వీధుల్లోకి వస్తాం’’.. CJP దీప్కే సంచలన ప్రకటన.!
- Bangladesh: షేక్ హసీనాను గద్దె దించిన బంగ్లాదేశ్ నేత.. ఇప్పుడు CJP నిరసనలకు మద్దతు.!
- Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
తాజావార్తలు
-
Mahant Rajudas: మోడీ జీ, అలాంటి జెన్-జీపై చర్యలు తీసుకోండి.. సీజేపీపై మహంత్ రాజూదాస్ ఆగ్రహం..
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Ganesh Acharya Biopic: తెరపైకి స్టార్ కొరియోగ్రాఫర్ లైఫ్ స్టోరీ.. ‘గణేశ్’ ట్రైలర్ చూశారా!
-
Smriti Mandhana: బాలల హక్కుల కోసం స్మృతి మంధాన ముందడుగు.. ఆహ్వానించిన సచిన్ టెండూల్కర్..
-
Pakistan: పాకిస్తాన్లో అరాచక పాలన.. ఖైబర్ ఫఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.!
ట్రెండింగ్
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..