Modi US Visit: వచ్చే నెల అమెరికాకు మోడీ.. యూఎస్ ఎన్నికల ముందు కీలక పర్యటన..
- వచ్చే నెల అమెరికాకు ప్రధాని నరేంద్రమోడీ..
- ఐక్యరాజ్యసమితి సమావేశానికి హాజరు..
- ప్రవాస భారతీయుల సమావేశంలో పాల్గొననున్న మోడీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Modi US Visit: ఐక్యరాజ్యసమితి వార్షిక సదస్సు కోసం వచ్చే నెలలో ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా వెళ్లనున్నట్లు తెలుస్తోంది. న్యూయార్క్ నగరంలో జరగబోయే ఈ కార్యక్రమానికి హాజరైన తర్వాత, అక్కడే ప్రవాస భారతీయులు నిర్వహించే భారీ సమావేశానికి మోడీ హాజరు కానున్నారు. అయితే, యూఎస్ ప్రెసిడెంట్ ఎన్నికల నేపథ్యంలో ఈ కార్యక్రమంలో ఆ దేశ నాయకులు ఎవరూ పాల్గొనరని సమాచారం. అయితే, అమెరికా ఎన్నికల ముందు ప్రధాని ఆ దేశానికి వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది. 18000 మంది హాజరయ్యే అవకాశం ఉన్న లాంగ్ ఐలాండ్‌లోని ఓపెన్ ఎయిర్ వేదికలో ప్రధాని మోడీ సమావేశం నిర్వహించబడుతుందని ఆయా వర్గాలు తెలిపాయి.
Read Also: Congress: ప్రధాని ‘‘కమ్యూనిల్ సివిల్ కోడ్’’ వ్యాఖ్యలపై కాంగ్రెస్ విమర్శలు..
Also Read
- Flydubai: రక్తమోడుతున్నా పట్టువదల్లేదు.. 180 మందిని కాపాడిన భారతీయ పైలట్ ఈయనే.!
- Modi-Trump: మోడీ-ట్రంప్ ఫోన్ కాల్.. ట్రేడ్, డిఫెన్స్, ఎనర్జీపై కీలక చర్చలు!
- Central Cabinet: కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర కేబినెట్.. గ్రీన్ ఎనర్జీ కారిడార్-3కు ఆమోదం..
- Flydubai: హైజాక్ అలర్ట్‌తో ఇజ్రాయెల్‌లో కలకలం.. ‘‘శత్రువును వదలం’’ అంటూ మంత్రి హెచ్చరిక!
‘సమ్మిట్ ఆఫ్ ది ఫ్యూచర్’తో ప్రారంభమయ్యే సెప్టెంబర్ 22 నుండి 28 వరకు ఐక్యరాజ్యసమితిలో ఉన్నత స్థాయి సమావేశాల కోసం మోడీ న్యూయార్క్ వెళ్లనున్నారు. సెప్టెంబర్ 26న జరిగే జనరల్ అసెంబ్లీలో ఆయన ప్రసంగిస్తారు. అయితే, నవంబర్ 5న అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఉన్నందున, అక్కడి దేశీయ రాజకీయాలపై ప్రభావం ఉండకూడదని, అమెరికా రాజకీయ నాయకులు ఈ సమావేశాలకు ఆహ్వానించలేదని తెలుస్తోంది.
2019లో అప్పటి అమెరికా అధ్యక్ష ఎన్నికల ముందు ప్రధాని మోడీ-డొనాల్డ్ ట్రంప్ హ్యూస్టన్‌లో జరిగిన భారీ సమావేశానికి హాజరయ్యారు. ఆ సమయంలో మోడీ ‘‘అబ్కీ బార్ ట్రంప్ సర్కార్’’ అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు అప్పటి ఎన్నికల్లో సంచలనంగా మారాయి. అయితే ఆ ఎన్నికల్లో ట్రంప్ ఓడిపోయి జో బైడెన్ గెలిచారు. మోడీ సమావేశంలో పాల్గొనే యూఎస్ నాయకులు తటస్థంగా ఉండాలని నిర్వాహకులు కోరుకుంటున్నారు. హ్యూస్టన్ సమావేశానికి ముందు సెప్టెంబర్ 2014లో తన మొదటి ఎన్నిలక విజయం తర్వాత ప్రధాని మోడీ ఐక్యరాజ్యసమితి సమావేశానికి వెళ్లారు. ఆ తర్వాత మాడిసన్ స్క్వేర్ గార్డెన్లో దాదాపు 20,000 మందితో నిండిన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. మరుసటి సంవత్సరం, అతను శాన్ జోస్‌లో డయాస్పోరాతో సామూహిక సమావేశాన్ని నిర్వహించాడు. గతేడాది ఐరాసలో జరిగిన ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా మాస్ ఎక్సర్సైజ్లో ప్రధాని మోదీ పాల్గొన్నారు.
తాజావార్తలు
-
LPG Cylinder Price Hike: పండుగ సీజన్‌కు ముందు బిగ్ షాక్.. భారీగా పెరిగిన ఎల్పీజీ సిలిండర్ల ధరలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!