NTV Telugu Site icon

Arvind Kejriwal: కన్నీరు పెట్టుకున్న ముఖ్యమంత్రి..

Kejriwal

Kejriwal

Arvind Kejriwal: ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి కన్నీరు పెట్టుకున్నారు. తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఢిల్లీలో కొత్త పాఠశాల ప్రారంభోత్సవం సందర్భంగా జైలు శిక్ష అనుభవిస్తున్న మాజీ డిప్యూటీ సీఎం, కేజ్రీవాల్ కు అత్యంత ఆప్తుడిగా పేరొందిన మనీష్ సిసోడియాను గురించి తలుచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన కన్నీరు పెట్టుకున్నారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో మనీష్ సిసోడియా జైలులో ఉన్నారు. గత ఫిబ్రవరి నెల నుంచి ఆయన జైలులోనే ఉన్నారు.

ఈ కార్యక్రమంలో సిసోడియా గురించి తీవ్ర భావోద్వేగానికి గురైన సీఎం కేజ్రీవాల్, తన కన్నీటిని తుడుచుకుంటూ.. ప్రతీ బిడ్డకు ఉత్తమమైన విద్యను అందించాలని మనీష్ సిసోడియా కలగన్నారని, అతను మంచి పాఠశాలలు నిర్మించి, పిల్లలకు సరైన విద్యకు భరోసా ఇచ్చినందకు ఆయన జైలు పాలయ్యారని అన్నారు. బీజేపీని పరోక్షంగా ఉద్దేశిస్తూ.. వారు విద్యారంగంలో ఢిల్లీ విప్లవం ముగియాలని కోరుకుంటున్నారని, దాన్ని మేం జరగనివ్వమని కేజ్రీవాల్ అన్నారు.

Read Also: Ganja Seller: వెలుగులోకి చీకటి వ్యాపారం.. పానీపూరి చాటున గంజాయి విక్రయం

మరోవైపు కేజ్రీవాల్ ప్రతిపక్షాల మద్దతు కూడగట్టేందుకు సిద్ధం అవుతున్నారు. ఢిల్లీ అధికారులు బదిలీ, నియామకం అంశాలు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే ఉండాలన్న సుప్రీంకోర్టు తీర్పుపై.. కేంద్ర ప్రభుత్వం కొత్త ఆర్డినెన్స్ తీసుకువచ్చింది. దీంతో మరోసారి కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంక్షోభం ఏర్పడింది. ఆర్డినెన్స్ చట్టంగా మారాలంటే ఆరు నెలల్లో పార్లమెంట్ ఆమోదం పొందాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం కేంద్రానికి లోక్ సభలో మెజారిటీ ఉంది. రాజ్యసభలో మెజారిటీ లేదు. ఈ నేపథ్యంలో రాజ్యసభలో ఆర్డినెన్స్ చట్టంగా మారడాన్ని అడ్డుకునేందుకు ప్రతిపక్షాల మద్దతు కూడగడుతోంది ఆప్. ఇప్పటికే తెలంగాణ సీఎం కేసీఆర్, తమిళనాడు సీఎం స్టాలిన్, ఎన్సీపీ నేత శరద్ పవార్, శివసేన(యూబీటీ) వర్గం నేత ఉద్దవ్ ఠాక్రేలను కలుసుకుని మద్దతు తెలపాలని కేజ్రీవాల్ కోరారు. సమాజ్ వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ ను కలుసుకోనున్నారు. ఇప్పటికే బీహార్ సీఎం నితీష్ కుమార్, డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ కేజ్రీవాల్ కు మద్దతు తెలిపారు. కేంద్రం తీసుకువచ్చిన ఆర్డినెన్స్ పై బీజేపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు.