కొందరు దొంగతనం చేసే తీరు కడుపుబ్బ నవ్విస్తుంటుంది. ఎందుకంటే వారు చేసే దొంగతనం అలా ఉంటుంది. దొంగతనం చేసి నేను మీబైక్ దొంగతనం చేశాను, మీ ఇంట్లో దొంగతనం చేశాను క్షమించండి అంటూ లెటర్ కూడా రాస్తుంటారు. మరి కొందరైతే ఏకంగా గడిలో దొంగతనం చేసి స్వామీ నన్ను క్షమించు అంటూ వేడుకోవడం ఫన్నీగా అనిపిస్తుంటుంది. అయితే ఓ దొంగ తను చేసిన దొంగతనం నవ్వాలో అతన్ని విమర్శించాలో అర్థంకాదు. పాపం లేత దొంగ కావచ్చు అంటూ కొందరు దానికి కామెంట్లు పెడుతున్నారు. ఇంతకీ ఆదొంగ ఏంచేశాడనే ప్రశ్నమీదైతే బీచ్ లో ఓఅమ్మాయి వద్దనుంచి డబ్బులు కొట్టేశాడు. ఇది మామూలే కదా ఫన్నీ ఏముంది అనుకుంటున్నారా? దొంగతనం చేశాడు బాగానే ఉంది అతను పారిపోవడానికి బీచ్ లో దూకాడన్న మాట. అయితే ఎక్కడవరకు ఈదగలడో అతనికే అర్థం అయ్యిందో లేదో తెలియదు కానీ.. దొంగతనం చేసిన కంగారులో ఎంత ఈదగలను అని మాత్రం అనుకోలేదు. చివరకు పోలీసులకు చిక్కాడు. ఈఘటన చెన్నై మెరీనా బీచ్ లో చోటుచేసుకుంది.
Read also: Bail For Mlc Ananthababu: అనంతబాబుకి బెయిల్.. సుప్రీంకోర్టులో రిలీఫ్
చెన్నై మెరీనా బీచ్ లో నిత్యం పర్యాటకు రద్దీగా ఉండే ప్రాంతం. చెన్నై మెరీనా బీచ్ లో సమీపంలో ఓ మహిళ వెళ్లడం గమనించిన ఓ నలుగురు దొంగల ముఠా ఆమె వద్ద ఉన్న డబ్బు, నగలు కొట్టేద్దామని ఆమె వద్దకు వెళ్లాడు. డబ్బులు, నగలు ఇవ్వాలని బలవంతం చేశాడు. అయితే ఆమె నిరాకరించడంతో ఆమెపై దాడి చేశాడు. ఆమె వద్ద వున్న పదివేల నగదు.. చైన్ దొంగతనం చేసిశారు. ఆమె గట్టిగా కేకలు వేసింది. దీంతో ఆమె వద్దనుంచి నగదు, నగలు తీసుకున్నా దొంగలు చెరోదిక్కు పారిపోయారు. కానీ ఓ దొంగ మెరీనా బీచ్ లోకి దూకేసాడు. ఈత కొట్టుకుంటూ వెలుతుండా రంగంలోకి దిగిన పోలీసులు సముద్రంలోకి దూకి దొంగను పట్టుకున్నారు. ఏదో సముద్రంలో దూకి పోలీసుల నుంచి తప్పించుకుందామని అనుకున్న దొంగకు పోలీసులు దేహశుద్ది చేసి బాధితురాలి ఫిర్యాదుతో దొంగను స్టేషన్ కు తరలించారు. బాధితురాలికి స్వల్ప గాయాలు కావడంతో ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిసున్నారు. మిగతా ముగ్గరికోసం గాలిస్తున్నారు. వారు ఎవరు? ఎక్కడి నుంచి వచ్చి చెన్నైలో ఎక్కడ బసచేస్తున్నారు? ఇంతకు ముందు ఇలా దొంగతనాలు ఎక్కడెక్కచేశారు? వీరిపై ఏమైన కేసులు నమోదు చేశారా? అనే కోణంలో అరా తీస్తున్నారు.
Moga Cyclone: ‘మాండూస్’ ముగిసింది.. ‘మోగా’ మోగిస్తది