వ్యాపారం చేసే ఎవరైనా సరే ప్రభుత్వానికి పన్ను చెల్లించాలి. జీఎస్టీలో వారి పేరు నమోదు చేసుకోవాలి. లేదంటే ఏదోక సమయంలో అన్ని వివరాలు బయటకు వస్తాయి. ఆ సమయంలో ఏం చేసినా మొత్తం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. సంపాదించింది మొత్తం కోల్పోవాల్సి వస్తుంది. ఆ మధ్య ఓ ముసలావిడ వీధిలో వీల్‌ఛైర్ మీద కూర్చోని యాచిస్తూ ఉందని, పని పూర్తయ్యకా హ్యాపీగా నడిచి వెళ్తుందని, యాచించిన డబ్బుతో ఖరీదైన వస్తువులు కొనుగోలు చేసినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. దీంతో ప్రపంచం మొత్తం విస్తుతపోయింది. ఇప్పుడు అదే విధంగా యూపీలోని కొందరు వ్యాపారులపై కూడా దృష్టి సారించగా షాకిచ్చేవిషయాలు వెలుగులోకి వచ్చాయి.
Read: ‘ఆడవాళ్ళు..’కు దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు
256 మంది చిరు వ్యాపారులకు సంబందించిన డేటాను ఆదాయపన్ను అధికారులు సేకరించగా వారంతా వీధి వ్యాపారం చేసుకునే వారు కాదని, అందరూ కోటీశ్వరులని తేలింది. చిరు వ్యాపారం చేసుకుంటూ వచ్చిన డబ్బును కూడబెట్టి కొట్లు సంపాదించారు. యూపీలోని కాన్పూర్ లో ఖరీదైన ప్రాంతాల్లో వీరికి కోట్లు విలువ చేసే బంగళాలు, కార్లు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ప్రభుత్వానికి ఒక్క రూపాయి పన్నుకూడా కట్టకుండా చిరు వ్యాపారం చేస్తూ డబ్బులు కూడబెడుతున్నారని లాక్‌డౌన్ సమయంలో వీరిలో చాలామంది పెద్ద ఆస్తులు కొనుగోలు చేసినట్టు ఆదాయపన్నుశాఖ తెలియజేసింది.