‘ఆడవాళ్ళు..’కు దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు

శర్వానంద్, రష్మిక మందన్న హీరోహీరోయిన్లుగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమాకు రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నారు. ఈ విషయాన్ని ఈ రోజు అధికారికంగా ప్రకటించింది చిత్ర యూనిట్. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఇటీవల హైదరాబాద్ లో ప్రారంభమైంది. హీరో శర్వానంద్, హీరోయిన్ రష్మిక మందన్న సహా ముఖ్య తారాగణంపై కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు దర్శకుడు కిషోర్ తిరుమల.

Read Also : వన్ ఇయర్ వర్కవుట్… ఎట్టకేలకు సన్నబడ్డ అర్జున్ కపూర్!

ఈ సినిమాలో శర్వానంద్, రష్మిక మందన్న క్యారెక్టర్లు ఆసక్తికరంగా ఉండ‌నున్నాయని, కిశోర్‌ తిరుమల మంచి ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా దీనిని తెర‌కెక్కిన్నారని, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం మంచి అసెట్ కానుంద’ని చిత్ర యూనిట్ తెలిపింది. గతంలో తిరుమల కిశోర్ దర్శకత్వం వహించిన ‘నేను శైలజ, ఉన్నది ఒకటే జిందగీ, చిత్రలహరి’ చిత్రాలకు దేవిశ్రీ ప్రసాదే సంగీతం అందించాడు. వారిద్దరి కాంబినేషన్ లో ఇది నాలుగో సినిమా కావడం విశేషం.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-