Haryana: ఎమ్మెల్యేపై దాడి చేసిన మహిళ.. ఊరు మునిగిపోనంక ఎందుకొచ్చావంటూ ప్రశ్నించిన మహిళ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Haryana: గత కొద్ది రోజులుగా ఉత్తరాది రాష్ట్రాల్లో వర్షాలు భీభత్సం సృష్టిస్తున్నాయి. భారీ వర్షాలు కురుస్తుండటంతో.. ఉత్తరాది రాష్ట్రాలు వరద నీటిలో మునిగిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే ఇళ్లల్లోకి పూర్తిగా నీరు చేరడంతో ఇళ్లు ఖాళీ చేసి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సహాయక కేంద్రాల్లో తలదాచుకుంటున్నారు. వర్షాల ప్రభావంతో ఇబ్బందులు పడుతున్న ప్రజలను ప్రజాప్రతినిధులు పరామర్శించడం సర్వసాధారణం. వరదల సందర్భంగా బాధిత ప్రజలను పరామర్శించడానికి వెళ్లే ప్రజాప్రతినిధులకు వింత వింత ఘటనలు ఎదురవుతుంటాయి. అలాంటి ఘటననే హర్యానాలో ఒక ఎమ్మెల్యే ఎదుర్కోవాల్సి వచ్చింది. వరద ప్రభావిత ప్రాంతాన్ని పరిశీలించడానికి వెళ్లిన ఎమ్మెల్యేను ఓ మహిళ చెప్పుతో కొట్టింది. తమ ఊరంతా వరద నీటిలో మునిగిపోయింది.. ఇప్పుడెందుకు వచ్చావ్ అంటూ నిలదీసింది. దీంతో చేసేదేం లేక ఆ ఎమ్మెల్యే అక్కడి నుంచి వెనుతిరిగి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది.
Read also: Hathinikund Barrage: హథినికుండ్ బ్యారేజీ గేట్లు ఎత్తితే ఢిల్లీ మునగడం ఖాయం.. ఎలానంటే ?
Also Read
- CM Vijay: సీఎం విజయ్ చేతిలో విరాట్ కోహ్లీ సైన్ చేసిన బ్యాట్.. సోషల్ మీడియాను ఊపేస్తున్న ఫొటో..
- Abhijit Dipke: "నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ చేశారు".. కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు సంచలన ఆరోపణలు
- Delhi Heatwave: ఢిల్లీలో నిప్పుల కొలిమి.. తారు రోడ్ల ఏకంగా 65°C ఉష్ణోగ్రత నమోదు!
- CNG Price Hike: సీఎన్జీ వాహనదారులకు మళ్లీ షాక్.. మరోసారి పెరిగిన ధరలు
గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో హర్యానాలోని ఘగ్గర్ నది పొంగి పొర్లు తున్నది. దీంతో భారీ వరదలతో ఘులా ప్రాంతం పూర్తిగా నీటమునింది. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతాన్ని పరిశీలించడానికి స్థానిక జననాయక్ జనతా పార్టీ (JJP) ఎమ్మెల్యే ఈశ్వర్ సింగ్ వెళ్లారు. తమ ఇండ్లు నీట మునిగి దిక్కుతోచని స్థితిలో ఉన్న ప్రజలు.. తమను ఎవరు పట్టించుకోలేదనే కోపంతో ఉన్నారు. ఎమ్మెల్యే తమ ప్రాంతానికి రావడంతో అతడిని చుట్టముట్టారు. వారిలో ఓ మహిళ చెప్పుతో ఎమ్మెల్యే చెంపపై ఒక్కటేసింది. అంతా మునిగిపోయాక.. ఇక్కడేముందని చూడటానికి వచ్చావంటూ ప్రశ్నించింది. నదిపై కట్టిన చెక్‌డ్యాం వల్లే తమకు ఈ పరిస్థితి ఏర్పడిందని ఆగ్రహం వ్యక్తంచేసింది. అయితే ఎమ్మెల్యే సహాయకులు సర్ధిచెప్పడంతో ఆమె శాంతించింది. తాను ఆమె బాధను అర్థం చేసుకోగలనని ఎమ్మెల్యే ఈశ్వర్ సింగ్ చెప్పారు. ఆమెపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. చెక్ డ్యాం వల్ల వరదలు రాలేదని.. భారీ వర్షాలే దానికి కారణమని ఆ మహిళతో చెప్పినట్లు వెల్లడించారు. జేజేపీ అధికార బీజేపీకి మిత్రపక్షం. ఎమ్మెల్యేను మహిళ చెప్పుతో కొట్టిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది.
#WATCH | Haryana: In a viral video, a flood victim can be seen slapping JJP (Jannayak Janta Party) MLA Ishwar Singh in Guhla as he visited the flood affected areas
"Why have you come now?", asks the flood victim pic.twitter.com/NVQmdjYFb0
— ANI (@ANI) July 12, 2023
తాజావార్తలు
-
Hyderabad: నెంబర్ ప్లేట్ లేని కారుతో ఢీ.. నగరంలో న్యాయవాది దారుణ హత్య!
-
Pakistan Cuts Petrol and Diesel Prices: పాక్‌లో భారీగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు.. వరుసగా రెండోసారి ఊరట
-
Trump: భారత్ దెబ్బకు భయపడి అమెరికా కాళ్లబేరానికి పాక్.. ఆపరేషన్ సిందూర్ సీజ్‌ఫైర్‌పై ట్రంప్ సంచలన ప్రకటన..
-
Kohli vs Head: సైగలతో రెచ్చగొట్టిన విరాట్.. కోహ్లీ-ట్రావిస్ హెడ్ మధ్య అసలేం జరిగింది?.. క్లారిటీ ఇదిగో!
-
Swayambhu: ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత భారీ గ్రాఫిక్స్‌తో వస్తున్న నిఖిల్ మూవీ
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్‌తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్‌తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!