Supreme Court: మణిపూర్‌లో మహిళలపై వేధింపు వీడియో బయటికి రావడంపై కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఈ ఘటనపై కేంద్రం సీబీఐతో విచారణ చేపట్టడానికి ఆదేశించింది. ముఖ్యంగా మహిళలపై జరిగిన అఘాయిత్యాలను తీవ్రంగా పరిగణిస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో ఎవరినీ ఉపేక్షించబోమని కేంద్రం స్పష్టం చేసింది. కేసు విచారణనే మణిపూర్ వెలుపలా నిర్వహించాలని.. అదీ కాలపరిమితిలో పూర్తయ్యేలా విచారించాలని కేంద్ర హోం శాఖ ఆదేశించింది. మణిపూర్‌లో ఇద్దరు మహిళల నగ్న ఊరేగింపు వీడియో ఘటనను సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించిన విషయం తెలిసిందే. సుప్రీం కోర్టు ఈ కేసును నేడు విచారణ చేపట్టనుంది.
ఉంది. ఈ తరుణంలో ఒక్కరోజు ముందు అంటే.. నిన్న గురువారం మణిపూర్ హింసపై సుప్రీం కోర్టులో కేంద్ర ప్రభుత్వం ఒక అఫిడవిట్ దాఖలు చేసింది.
Read also: Captain Miller Teaser: ‘కెప్టెన్ మిల్లర్’ టీజర్ వచ్చేసింది.. ధనుష్ బర్త్ డే గిఫ్ట్ అదిరిపోలా!
కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)కి బదిలీ చేసినట్లు సర్వోన్నత న్యాయస్థానానికి సమర్పించిన అఫిడవిట్‌లో కేంద్ర హోం శాఖ వెల్లడినట్టు తెలుస్తోంది. మరోవైపు ఈ కేసు ట్రయల్ కాలపరిమితితో(ఆరు నెలల గడువు) జరగాలని.. అదీ మణిపూర్ వెలుపలే జరగాలని అఫిడవిట్‌లో సుప్రీంను కోరింది. కేంద్రం మాత్రం దర్యాప్తు వీలైనంత త్వరగా పూర్తవుతుందని నమ్ముతోంది. అయితే విచారణ మాత్రం కాలపరిమితితో పూర్తి కావాలని, ఆ విచారణ మణిపూర్ వెలుపలే జరిగేలా ఆదేశాలు జారీ చేయాలని సుప్రీం కోర్టును కేంద్ర హోం శాఖ కోరింది. శాంతి భద్రతల అంశం ఆ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే అయినా.. కేంద్రం తమ వంతుగా న్యాయం చేసేందుకు కృషి చేస్తోందని కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా సదరు అఫిడవిట్‌లో స్పష్టం చేశారు. లైంగిక దాడికి సంబంధించిన వీడియో వెలుగులోకి వచ్చాక.. కేంద్రం ఎప్పటికప్పుడు కేసు పురోగతిని పర్యవేక్షిస్తోందని తెలియజేసింది. దీంతో నేటి విచారణలో కేంద్రం అఫిడవిట్‌పై సుప్రీం ధర్మాసనం ఎలా స్పందిస్తుందనే ఆసక్తి నెలకొంది.
Read also: Mahalakshmi Stotras: మహా సంపదలు మీ సొంతం శుక్రవారం ఈ స్తోత్రం వినండి
ఇదిలా ఉంటే.. సోషల్ మీడియా ద్వారా మణిపూర్ వైరల్ వీడియోను సుప్రీం కోర్టు సుమోటోగా స్వీకరించింది . జులై 20వ తేదీన భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ ధర్మాసనం .. కేంద్రం, మణిపూర్ ప్రభుత్వాలపై తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేసింది. అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి, సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతాలను ఉద్దేశిస్తూ.. ‘‘యావత్ దేశమే కాదు.. ఈ న్యాయస్థానాన్ని ఆ వీడియో బాధించింది. మహిళలపై హింస దృశ్యాలను సామాజిక మాధ్యమాల్లో ప్రసారం చేయడం రాజ్యాంగ విరుద్ధం. ఈ వీడియోతో ప్రజలు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. ఇది మానవ హక్కుల ఉల్లంఘనే అవుతుంది. నేరస్తులను శిక్షించే విషయంలో ఇప్పటివరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేయలేకపోయాయి. ప్రభుత్వాలు గనుక చర్యలు చేపట్టకపోతే మేమే రంగంలోకి దిగుతామ’’ని తీవ్ర వ్యాఖ్యలే చేసింది. ఈ క్రమంలో ఎలాంటి చర్యలు చేపట్టారో తెలియజేయాలని కేంద్రాన్ని ఆదేశిస్తూ.. నేటి(జులై 28)కి విచారణ వాయిదా వేసింది. నేడు సుప్రీంకోర్టు విచారణను చేపట్టనుంది.