The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్‌కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
The Lalit Hotel: దేశ రాజధానిలోని బారాఖంబా లేన్‌లో ఉన్న ఐకానిక్ హోటల్ ‘ద లలిత్’ భవిష్యత్తు ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఈ హోటల్ నడుపుతున్న భారత్ హోటల్స్ లిమిటెడ్ లైసెన్స్‌ను రద్దు చేస్తూ న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ (NDMC) గతంలో తీసుకున్న నిర్ణయాన్ని ఢిల్లీ హైకోర్టు సమర్థించింది. ఏప్రిల్ 22, 2026న వెలువడిన ఈ తీర్పు హోటల్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. అసలు ఏం జరిగిందంటే.. ఈ వివాదానికి మూలం 6.0485 ఎకరాల ప్రభుత్వ భూమి. 1982లో ఎన్డీఎంసీ – భారత్ హోటల్స్ లిమిటెడ్ మధ్య 99 ఏళ్ల లైసెన్స్ ఒప్పందం కుదిరింది. అయితే ఒప్పందం ప్రకారం 33 ఏళ్ల తర్వాత లైసెన్స్ ఫీజును సవరించే అధికారం ప్రభుత్వానికి ఉంది. దీని ప్రకారం.. పెరిగిన అద్దె, బకాయిల కింద రూ.1,063.74 కోట్లు చెల్లించాలని 2020లో ఎన్డీఎంసీ నోటీసు ఇచ్చింది. ఆ మొత్తాన్ని చెల్లించకపోవడంతో లైసెన్స్‌ను రద్దు చేసింది.
ఈ కేసును విచారించిన హైకోర్టు డివిజన్ బెంచ్ (చీఫ్ జస్టిస్ డి.కె. ఉపాధ్యాయ, జస్టిస్ తుషార్ రావు) ఎన్డీఎంసీ నిర్ణయం సరైనదేనని తేల్చింది. రాజధానిలో భూమి పరిమితమైన, అత్యంత విలువైన వనరు అని, ప్రభుత్వ సంస్థకు నష్టం కలిగేలా ఏ ఒప్పందం కొనసాగకూడదని కోర్టు స్పష్టం చేసింది. హోటల్ ప్రాంగణంలోని కమర్షియల్ స్పేస్‌ను సబ్-లైసెన్స్‌కు ఇవ్వడం కూడా నిబంధనలకు విరుద్ధమని కోర్టు అభిప్రాయపడింది. ప్రముఖ పారిశ్రామికవేత్త లలిత్ సూరి 1980వ దశకంలో ఈ హోటల్ సామ్రాజ్యాన్ని స్థాపించారు. 1988లో 444 గదులతో ప్రారంభమైన ఈ హోటల్, దేశవ్యాప్తంగా గోవా, ముంబై, బెంగళూరు వంటి నగరాలకు విస్తరించింది. 2006లో ఆయన మరణం తర్వాత భార్య జ్యోత్స్న సూరి నాయకత్వంలో ‘ద లలిత్’ బ్రాండ్ అంతర్జాతీయ స్థాయికి చేరింది.
Also Read
- Sergio Gor: గత వారం మోడీ-ట్రంప్ మాట్లాడుకున్నారు.. ఏం జరుగుతుందో చూద్దామన్న సెర్గియా గోర్
- Supreme Court: ఓటర్ల తొలగింపుపై ఇండియా కూటమి పిటిషన్.. 14 రకాల సాంకేతిక లోపాలను ఎత్తిచూపిన సుప్రీంకోర్టు రిజిస్ట్రీ
- SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
- New Governors : ఈ రాష్ట్రాలకు కొత్త గవర్నర్ల నియామకం
హైకోర్టు తీర్పుతో ఇప్పుడు ఎన్డీఎంసీకి సర్వాధికారాలు లభించాయి. బకాయిలను వసూలు చేయడం కోసం హోటల్‌ను సీజ్ చేసే లేదా భూమిని తిరిగి స్వాధీనం చేసుకునే అవకాశం ఉంది. అయితే భారత్ హోటల్స్ లిమిటెడ్ ఈ తీర్పును సుప్రీంకోర్టులో సవాలు చేసే అవకాశం ఉంది. ప్రభుత్వ భూములపై ప్రైవేట్ ప్రాజెక్టులు చేపట్టే ఇతర సంస్థలకు కూడా ఈ తీర్పు ఒక హెచ్చరికలాంటిదని న్యాయ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
- Tags
తాజావార్తలు
-
Oneplus 16 Launched: 9000mAh బ్యాటరీ, 200MP కెమెరా, 120X జూమ్.. వన్ ప్లస్ నుంచి మొబైల్ లాంచ్..
-
Kitchen Cleaning Tips: కిచెన్ సింక్‌లో నీళ్లు నిలిచిపోతున్నాయా? ఈ చిట్కాలతో సులభంగా క్లియర్ చేయండి!
-
New Car Launched: ఒక్కసారి ఛార్జ్ చేస్తే 828 కిలోమీటర్లు వెళ్లొచ్చు.. మైండ్ బ్లోయింగ్ కారు ఫీచర్స్ ఇవే..
-
Sergio Gor: గత వారం మోడీ-ట్రంప్ మాట్లాడుకున్నారు.. ఏం జరుగుతుందో చూద్దామన్న సెర్గియా గోర్
-
Tuesday Horoscope: మంగళవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి అన్ని శుభాలే!
ట్రెండింగ్
-
7 రోజుల బ్యాటరీ, ECG, GPSతో Google Fitbit Edge లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Rishabh Pant Ruled Out: రిషబ్ పంత్ అవుట్.. కీలక ప్లేయర్ ఇన్.!
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!