The Kerala Story: దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్న ‘కేరళ స్టోరీ’ విడుదలకు ముందే వివాదాస్పదం అయింది. గత శుక్రవారం దేశవ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్ అయింది. ఇప్పటికే ఈ సినిమాను తమిళనాడు, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలు బ్యాన్ చేశాయి. ఇదిలా ఉంటే మధ్యప్రదేశ్ రాష్ట్రం ఈ సినిమాకు టాక్సును రద్దు చేసింది. ఇదిలా ఉంటే ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం కూడా ఈ సినిమాకు పన్ను మినహాయింపు ఇచ్చింది.
ఇదిలా ఉంటే ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, తన మంత్రి వర్గంతో కలిసి సినిమా చూడాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాకు టాక్స్ ఫ్రీ కల్పిస్తున్నట్లు యోగి స్వయంగా ప్రకటించారు. దీని గురించి ఆయన హిందీలో ట్వీట్ చేశారు. యోగి క్యాబినెట్ మొత్తం ఈ సినిమాను చూడాలని భావిస్తున్నారు. ఇదిలా ఉంటే మరో బీజేపీ పాలిత రాష్ట్ర ఉత్తరాఖండ్ కూడా ఈ సినిమాకు ‘టాక్స్ ఫ్రీ’ కల్పించేందుకు సిద్ధం అవుతోంది. దీనికి సంబంధించి పుష్కర్ సింగ్ ధామి ప్రకటన చేస్తారని భావిస్తున్నారు. సీఎం ధామి మంగళవారం సాయంత్రం 5 గంటలకు డెహ్రాడూన్ లోని పీవీఆర్ థియేటర్ లో సినిమా చూసే అవకాశం ఉంది. ఆయనతో పాటు కేబినెట్ మంత్రి గణేష్ జోషి కూడా ఉండనున్నారు.
Read Also: Revanth Reddy: అసెంబ్లీ సాక్షిగా సీఎం ఇచ్చిన హామీకే దిక్కులేదు..!
మూవీ మేకర్స్ కి బెదిరింపులు..
ఇదిలా ఉంటే ఈ సినిమాను కొన్ని వర్గాల ప్రజలు సమర్థిస్తుంటే కొందరు వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యంగా ముస్లిం సంస్థలు, వామపక్షాలు, కాంగ్రెస్ పార్టీ, డీఎంకే పార్టీలు ఈ సినిమాను వ్యతిరేకిస్తున్నాయి. ఈ క్రమంలో ఈ సినిమా మేకర్స్ బెదిరింపులు ఎదుర్కొంటున్నారు. ఈ సినిమా దర్శకుడు సుదీప్తో సేన్, ఇతరులకు తెలియని నెంబర్ నుంచి బెదిరింపులు వచ్చాయి. ‘‘ఒంటరిగా బయటకు వెళ్లొద్దు, మీరు మంచి పనులు చేయలేదు’’ అని అఘాంతకుడు బెదిరించాడు. ఈ బెదిరింపులపై సుదీప్తో సేన్ ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
వివాదం ఇది..
కేరళ స్టోరీ సినిమా మతమార్పిడులు, లవ్ జిహాద్, ఉగ్రవాదం ఇతివృత్తంగా రూపొందించబడింది. కేరళలో 32,000 హిందూ, క్రిస్టియన్ యువతులు మతమార్పిడికి గురయ్యారని, ఇందులో కొంత మంది ఐసిస్ ఉగ్రవాద సంస్థలో చేరారని సినిమాలో చూపించారు. ఐసిస్ లో పనిచేసేందుకు సిరియాకు వెళ్లారని సినిమా ట్రైలర్ లో చూపించడం వివాదాస్పదం అయింది.