Site icon NTV Telugu

COVID-19: కరోనాపై కేంద్రం అప్రమత్తం.. మళ్లీ మాస్కులు ధరించాలని సూచన

Covid 19

Covid 19

The central government has organized a key meeting on Covid-19: ప్రపంచవ్యాప్తంగా మళ్లీ కోవిడ్-19 ప్రకంపనలు ప్రారంభం అయ్యాయి. ఇప్పటికే చైనాతో పాటు పలు దేశాల్లో పరిస్థితులు అధ్వానంగా మారాయి. ముఖ్యంగా చైనాలో కేసుల సంఖ్య నానాటికి పెరుగుతోంది. ఇప్పటికే అక్కడ అంత్యక్రియలకు కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఏర్పాడ్డాయి. దీంతో అంతర్జాతీయంగా కోవిడ్ పరిణామాలపై భారతదేశం కూడా అప్రమత్తం అయింది.

తాజాగా కేంద్ర ఆరోగ్యమంత్రి మన్సుఖ్ మాండవీయ అధ్యక్షతన బుధవారం కీలక సమావేశం జరిగింది. కోవిడ్ టాస్క్ ఫోర్స్ చీఫ్ వీకే పాల్ తో పాటు ఉన్నతాధికారులు, నిపుణులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. కోవిడ్ ఇంకా ముగియలేదు.. అప్రమత్తంగా ఉండాలని.. నిఘాను పటిష్టం చేయాలని అధికారులను ఆదేశించినట్లు కేంద్రమంత్రి సమావేశం అనంతరం ట్వీట్ చేశారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన వెల్లడించారు.

Read Also: RRR for Oscars : రాజమౌళి ఆశలు ఫలించేనా.? ట్రిపుల్ఆర్‎కు ఆస్కార్ దక్కేనా.. ?

ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని.. తగిన పరీక్షలు నిర్వహిస్తున్నామని..రద్దీగా ఉండే ప్రాంతాల్లో మాస్కులు ధరించాలని ప్రజలకు సూచించారు. సీనియర్ సిటిజెన్లు బూస్టర్ డోసులు వేసుకోవాలని కేంద్ర మంత్రి సూచించారు. జాతీయ కోవిడ్ టాస్క్ ఫోర్స్, నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్. అంతర్జాతీయ విమాన ప్రయాణానికి సంబంధించి మార్గదర్శకాల్లో ఎలాంటి మార్పు లేదని వెల్లడించారు. ఈ సమీక్షాసమావేశం ముఖ్యంగా 6 కీలక అంశాలపై జరిగినట్లు అధికార వర్గాలు తెలిపాయి. అంతర్జాతీయ, దేశీయ విమానాశ్రయాల్లో కేసులను నిరోధించే వ్యూహం, విదేశాల నుంచి ప్రయాణించే ప్రయాణీకుల కోసం మార్గదర్శకాలు రూపొందించడం, కోవిడ్ కొత్త వేరియంట్ పై నిపుణులతో సంప్రదింపులు జరడం వంటివి ఇందులో ఉన్నాయి. రాబోయే న్యూఇయర్ పార్టీ వేడుకలకు సంబంధించి ప్రోటోకాల్ కూడా ఇందులో భాగంగా చర్చించినట్లు తెలుస్తోంది.

అన్ని కోవిడ్ పాజిటివ్ కేసులను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపాలని కేంద్రపాలిత ప్రాంతాలకు, రాష్ట్రాలకు సూచించారు. చైనాతో పాటు జపాన్, యూఎస్ఏ, కొరియా, బ్రెజిల్ దేశాల్లో కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోందని కరోనా వేరియంట్లను ట్రాక్ చేయడానికి జీనోమ్ సీక్వెన్సింగ్ చాలా అవసరం అని ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేేష్ భూషన్ అన్ని రాష్ట్రాలకు సూచించారు. దేశంలో గత 24 గంటల్లో ఇండియా వ్యాప్తంగా 129 కేసులు నమోదు అయ్యాయి. దేశంలో ఇప్పటి వరకు 5,30,677 కేసులు నమోదు అయ్యాయి. ప్రస్తుతం ఇండియాలో 3,408 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

Exit mobile version