Terrorist Digital Plan: భారత్ టార్గెట్‌గా టెర్రరిస్టుల కొత్త ‘డిజిటల్’ ప్లాన్.. నిఘా వర్గాలకు అంతుచిక్కని మిస్టరీ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Terrorist Digital Plan: దేశంలోని ఉగ్రవాదులు తమ నెట్‌వర్క్‌ను విస్తరించేందుకు, సరిహద్దుల అవతల ఉన్న తమ హ్యాండ్లర్లతో సంబంధాలు కొనసాగించేందుకు అత్యంత అధునాతన మార్గాలను ఎంచుకుంటున్నారు. భద్రతా దళాల నిఘా నుంచి తప్పించుకోవడానికి వారు సరికొత్త ‘డిజిటల్ కోడ్‌వర్డ్’లను ఉపయోగిస్తున్నట్లు జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) విచారణలో తేలింది. ముఖ్యంగా విదేశీ ఎన్క్రిప్టెడ్ మెసేజింగ్ అప్లికేషన్లే ఇప్పుడు ఉగ్రవాదులకు ప్రధాన ఆయుధాలుగా మారాయి.
ఎన్క్రిప్టెడ్ యాప్స్ నుంచే అంతా..
లష్కరే తోయిబా (LeT), జైషే మహమ్మద్ వంటి ప్రమాదకర ఉగ్రవాద సంస్థలు జమ్మూ కాశ్మీర్ కేంద్రంగా తమ కార్యకలాపాలు సాగిస్తున్నాయి. ఇటీవల జమ్మూ కాశ్మీర్ పోలీసులు అరెస్ట్ చేసిన లష్కర్ ఉగ్రవాది ‘హురైరా’ను విచారించిన ఎన్ఐఏ అధికారులకు దిమ్మతిరిగే నిజాలు తెలిశాయి. నిఘా అధికారులకు చిక్కిన ఉగ్రవాదులు ఉపయోగిస్తున్న కొన్ని యాప్స్ కనీసం మొబైల్ నెంబర్ లేదా ఈమెయిల్ ఐడీ లేకుండానే పనిచేస్తాయి. దీనివల్ల వారిని ట్రేస్ చేయడం లేదా వారి మాటలను డీకోడ్ చేయడం దర్యాప్తు సంస్థలకు సవాలుగా మారింది. దర్యాప్తు సంస్థల రడార్‌లో ప్రధానంగా ‘త్రీమా’ అనే స్విస్ ఆధారిత మెసేజింగ్ యాప్ ఉంది. ఇది ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ కలిగిన ప్లాట్‌ఫామ్. ఇందులో ఖాతా తెరవడానికి వ్యక్తిగత సమాచారం ఏదీ అవసరం లేదు.
Also Read
- CM Vijay: ‘రాజరికం, కుటుంబ పాలనకు TVKలో చోటు లేదు’.. ధారాపురం సభలో విజయ్ కీలక వ్యాఖ్యలు
- LPG e-KYC: ముగిసిన ఆఖరి గడువు.. ఎల్పీజీ ఇ-కేవైసీ చేయని వాళ్లకు గ్యాస్ వస్తుందా? క్లారిటీ ఇదిగో..
- PM Modi: ‘నిన్ను చూసి భారత్ గర్విస్తోంది’.. స్మిత్ మచ్చార్‌కు ప్రధాని మోడీ ప్రశంసలు
- Flydubai: రక్తమోడుతున్నా పట్టువదల్లేదు.. 180 మందిని కాపాడిన భారతీయ పైలట్ ఈయనే.!
డస్ట్ మెసెంజర్ అనే అమెరికాకు చెందిన యాప్‌ను కూడా ఉగ్రవాదులు విరివిగా వాడుతున్నారు. దీని ద్వారా సరిహద్దుల అవతల ఉన్న నేతలతో నిరంతరం మాట్లాడుతున్నట్లు అధికారుల విచారణలో తేలింది. ఎలిమెంట్ అనే ప్లాట్‌ఫామ్‌ను సమాచార మార్పిడి కోసం లష్కర్ ఉగ్రవాదులు వాడుతున్నట్లు గుర్తించారు. ఈ డిజిటల్ నెట్‌వర్క్‌ను ఛేదించేందుకు NIA, ఇతర భద్రతా సంస్థలు తమ దర్యాప్తును ముమ్మరం చేశాయి. ఈ యాప్స్ ద్వారా సరిహద్దుల అవతల నుంచి ఎలాంటి ఆదేశాలు వచ్చాయి? ఏయే ప్రాంతాల్లో దాడులకు ప్లాన్ చేశారు? అనే కోణంలో డిజిటల్ సాక్ష్యాలను సేకరిస్తున్నారు. సాంప్రదాయ పద్ధతులను పక్కన పెట్టి టెర్రరిస్టులు ఇలాంటి టెక్నాలజీని వాడుతుండటం అంతర్గత భద్రతపై ఆందోళన కలిగిస్తోంది.
తాజావార్తలు
-
JioBharat 4G Phone: రూ.299కే JioBharat 4G ఫోన్?.. జియో 10వ యానివర్సరీ ఆఫర్ ఇదే!
-
Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
-
Gautam Gambhir: “ఇదో చెత్త మ్యాచ్.. ఆ రికార్డులు ఎవరికి కావాలి?”.. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఫైర్..
-
Rohit Sharma Celebration: అది నా కోసం మాత్రమే, నేను చెప్పను.. జాగింగ్ సెలబ్రేషన్స్‌పై రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Anakapalli: సినిమా డైరెక్ట్ చేయడం కన్నా.. దాన్ని నిర్మించి రిలీజ్ చేయడమే మహా కష్టం! డైరెక్టర్ త్రినాథరావు నక్కిన షాకింగ్ కామెంట్స్!
ట్రెండింగ్
-
8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
-
భారీ బ్యాటరీ, ఇమర్సివ్ డిస్ప్లేతో అక్టోబర్ 6న Vivo S2 FE లాంచ్‌కు రెడీ..!
-
POCO Big Billion Days Sale 2026: రూ.11,999 నుంచే స్మార్ట్ఫోన్లు.. X8 సిరీస్‌పై భారీ డిస్కౌంట్లు.!
-
1,600 నిట్స్ డిస్ప్లే, 3nm చిప్సెట్, Galaxy AI ఫీచర్లతో Samsung Galaxy Tab S12 సిరీస్ లాంచ్..!
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!