Site icon NTV Telugu

Benjamin Netanyahu: భారత్‌కు ఇజ్రాయిల్ మద్దతు.. ఢిల్లీ ఘటనపై నెతన్యాహూ కీలక వ్యాఖ్యలు..

Modi Netanyahu

Modi Netanyahu

Benjamin Netanyahu: ఢిల్లీ కారు బాంబ్ బ్లాస్ట్‌ దేశాన్ని మరోసారి కలవరపెట్టింది. సోమవారం సాయంత్రం ఎర్రకోట వద్ద జరిగిన ఈ ఘటనపై ఇజ్రాయిల్ భారత్‌కు మద్దతు తెలిపింది. ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహూ ఈ ఘటనపై స్పందించారు. బాధిత కుటుంబాలకు తన సంతాపాన్ని తెలియజేశారు. ‘‘ మా ప్రియమైన మిత్రుడు నరేంద్రమోడీకి, భారతదేశంలో ధైర్యవంతులైన ప్రజలకు.. నేను, ఇజ్రాయిల్ ప్రజలు, బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాము. ఈ విషాద సమయంలో ఇజ్రాయిల్ మీతో బలంగా నిలుస్తుంది’’ అని ఎక్స్‌లో ట్వీట్ చేశారు.

భారత్, ఇజ్రాయిల్ పురాతనమైన నాగరికతలు అయినప్పటికీ, అవి ఒకే రకమైన కఠిన పరీక్ష అయిన ఉగ్రవాదంతో బాధపడుతున్నాయి, రెండు దేశాలు ఉగ్రవాదానికి ఎప్పటికీ లొంగిపోవని నెతన్యాహూ అన్నారు. భారత్, ఇజ్రాయిల్ శాశ్వత సత్యాలపై నిలబడే పురాతన నాగరికతలు, దాడులు మన నగరాలను తాకవచ్చు కానీ, మన ఆత్మలను ఎప్పటికీ కదిలించలేవు, మన దేశాలు వెలుగులు మన శత్రువుల చీకటిని అధిగమిస్తాయి అని ఆయన అన్నారు.

Read Also: Delhi Blast 2025: ఢిల్లీ పేలుళ్లలో తెరపైకి PAFF పేరు.. ! PAFF ఏ ఉగ్ర సంస్థ అనుబంధమో తెలుసా?

ఈ దాడిలో పాకిస్తాన్ ఉగ్ర సంస్థ జైషే మహ్మద్ ప్రమేయం ఉన్నట్లు దర్యాప్తులో తేలింది. ఢిల్లీ మాత్రమే కాకుండా గురుగ్రామ్, ఫరీదాబాద్ వంటి ఢిల్లీ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో కూడా దాడులు చేయాలని ఈ ఉగ్ర డాక్టర్లు ప్లాన్ చేశారు. ఆత్మాహుతికి పాల్పడిన వ్యక్తిని డాక్టర్ ఉమర్ నబీ అని భావిస్తున్నారు. ఇప్పటికే మరో ముగ్గురు డాక్టర్లు షహీన్ సయీద్, ముజ్మిల్ షకీల్ గనాలే, అదీల్ రాథర్ లను పోలీసులు అరెస్ట్ చేశారు.

నెతన్యాహుకు ముందు ఇజ్రాయిల్ విదేశాంగ మంత్రి గిడియన్ సార్ కూడా భారత్ దేశానికి సంఘీభావం తెలిపారు. ఢిల్లీ కారు బాంబ్ బ్లాస్ట్‌లో చనిపోయిన అమాయక బాధిత కుటుంబాలకు ఇజ్రాయిల్ తరుపున సానుభూతి తెలియజేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కాంక్షించారు. భారతదేశంలో ఇజ్రాయిల్ రాయబారి రూవెన్ అజార్ కూడా ఈ దాడిని ‘‘హృదయ విదారకమైంది’’గా అభివర్ణించారు.

Exit mobile version