Telugu population In USA: అమెరికా గడ్డ తెలుగోడి అడ్డా.. 8 ఏళ్లలో 4 రెట్లు పెరుగుదల..
- అమెరికా గడ్డ తెలుగోడి అడ్డా..
- యూస్‌లో పెరిగిన తెలుగు వారు..
- 8 ఏళ్లలో నాలుగు రెట్లు పెరుగుదల..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telugu population: ఇటీవల కాలంలో తెలుగు రాష్ట్రాల నుంచి చాలా మంది చదువు, ఉద్యోగాల కోసం విదేశాల బాట పడుతున్నారు. ముఖ్యంగా అమెరికానే తమ గమ్యస్థానంగా చాలా మంది ఎంచుకుంటున్నారు. తమ కొడుకు, కూతురు అమెరికాలో ఉంటున్నారని గర్వంగా చెప్పుకుంటున్నారు వారి తల్లిదండ్రులు. దేశవ్యాప్తంగా పరిశీలిస్తే మనవాళ్లే ఎక్కువగా యూఎస్ వెళ్తున్నట్లు తెలుస్తోంది. గణాంకాలను పరిశీలిస్తే 2016లో 3,20,000 మంది ఉండే తెలుగువారి సంఖ్య 2024 నాటికి 1.23 మిలియన్లకు పెరిగింది.
యూఎస్ అత్యధికంగా మాట్లాడే విదేశీ భాషల్లో తెలుగు 11వ స్థానంలో ఉంది. అత్యధికంగా మాట్లాడే భారతీయ భాషగా 3వ స్థానంలో ఉంది. తొలి రెండు స్థానాల్లో హిందీ, గుజరాతీ ఉన్నాయి. US సెన్సస్ బ్యూరో డేటా ఆధారంగా US యొక్క స్టాటిస్టికల్ అట్లాస్ నుండి వచ్చిన నివేదిక ప్రకారం, ఈ పెరుగుదలో నాలుగో తరం వలసదారులు, ఇటీవల కాలంలో వచ్చిన విద్యార్థులు కూడా ఉన్నారు. తెలుగు మాట్లాడేవారిలో దాదాపుగా 2 లక్షల మంది నివాసితులు కాలిఫోర్నియాలో ఉంటున్నారు. 1,50,000 మందితో టెక్సాస్‌లో ఉండగా, 1.10 లక్షల మంది న్యూజెర్సీలో ఉన్నారు. ఈ తర్వాతి స్థానాల్లో ఇల్లినాయిస్‌లో 83,000 మంది, వర్జీనియాలో 78,000 మంది, జార్జియాలో 52,000 మంది తెలుగువారు ఉన్నారు.
Also Read
- Minister Rekha Arya Files FIR Against Husband: ఇతర మహిళలతో సంబంధాలు.. భర్తపై ఫిర్యాదు చేసిన మంత్రి.. అసలేం జరిగింది?
- Consumer Court: రూ.2 కోసం కక్కుర్తి పడితే రూ.1.06 లక్షల వాత!
- Special Summary Revision: SIR వివాదం మధ్య ఈసీ కీలక నిర్ణయం.. 17 రాష్ట్రాల్లో ఓటరు జాబితాల సవరణకు ఆదేశాలు!
- Jio Recharge: యూజర్లకు జియో షాక్.. రీఛార్జ్ ధరల పెరిగే ఛాన్స్..!
Read Also: Ponguleti: గత ప్రభుత్వం పద్మశ్రీ రామచంద్రయ్యకు ఇచ్చిన హామీలు కాగితాలకే పరిమితమయ్యాయి..
2010 నుంచి 2017 మధ్యకాలంలో అమెరికాలో తెలుగు మాట్లాడేవారి సంఖ్య 86% పెరిగిందని 2017లో అధ్యయనం చేసిన అమెరికన్ థింక్ ట్యాంక్ సెంటర్ ఫర్ ఇమ్మిగ్రేషన్ వెల్లడించింది. అమెరికాలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న భాష తెలుగు అని తెలిపింది. 2010లో అమెరికాలో తెలుగు మాట్లాడేవారి సంఖ్య 4 లక్షల మందికి పైగా ఉందంటే, ప్రస్తుతం ఆ దేశంలో తెలుగు మాట్లాడే వారి సంఖ్య ఎంతగా పెరిగిందో అర్థం చేసుకోవచ్చు.
ప్రతీ ఏడాది తెలుగు మాట్లాడే ప్రాంతాల నుండి 60,000 నుండి 70,000 మంది విద్యార్థులు అమెరికా వెళ్తున్నారు. దాదాపుగా 10,000 మంది తెలుగు మాట్లాడేవారు H-1B వీసా కిందకు వస్తున్నారు. ఉత్తర అమెరికా తెలుగు అసోసియేషన్ మాజీ సెక్రటరీ అశోక్ కొల్లా ప్రకారం, కొత్తవారిలో 80 శాతం మంది తమ సంస్థలో నమోదు చేసుకున్నారని, దాదాపుగా 75 శాతం మంది డల్లాస్, బే ఏరియా, నార్త్ కరోలినా, న్యూ జెర్సీ, అట్లాంటా, ఫ్లోరిడా, నాష్విల్లే వంటి నగరాల్లో స్థిరపడుతున్నారు. అమెరికాలో భారతీయ విద్యార్థుల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు 12.5 శాతం ఉన్నారు. కెంట్ స్టేట్ యూనివర్సిటీల్లో కొత్త విద్యార్థులకు స్వాగతం చెబుతూ తెలుగులో శుభాకాంక్షలు చెబుతుందంటే మన వారి డామినేషన్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
తాజావార్తలు
-
TDP, Jana Sena, BJP Candidates List: కూటమి సీట్ల పంపకం ఖరారు..! 17 కార్పొరేషన్లు.. 106 మున్సిపాలిటీలు.. ఏ పార్టీకి ఎక్కడంటే?
-
TG Safe Raids : ఈగలు, ఎలుకల మధ్య స్వీట్ల తయారీ.. 2,480 కిలోలు ధ్వంసం..
-
Off The Record: ఆశించినన్ని సీట్లు వచ్చే పరిస్థితి లేక పోవడంతో జనసైనికులు డీలా..!
-
OTR : బాల్కొండ టికెట్ నాదే.. ఇంచార్జ్ ముందే ఓపెన్‌గా ప్రకటించిన మానాల మోహన్ రెడ్డి
-
OTR: ఆ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ లో కూటమిలో విభేదాలకు కారణం అవుతున్నాయా?
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!