Tejaswi Yadav: బీహార్‌లో జేడీయూ శకం ముగిసింది.. నితీష్‌ను బీజేపీ హైజాక్ చేసిందన్న తేజస్వి యాదవ్
- నితీష్ కుమార్ రాజ్యసభకు వెళ్లడంపై స్పందించిన తేజస్వి యాదవ్
- బీహార్‌లో జేడీయూ శకం ముగిసింది
- నితీష్‌ను బీజేపీ హైజాక్ చేసిందని వ్యాఖ్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజ్యసభ ఎన్నికల వేళ బీహార్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. అనూహ్యంగా ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాజ్యసభకు వెళ్తున్నట్లు ప్రకటించారు. దీంతో బీహార్ రాజకీయాలు ఒక్కసారిగా కీలక మలుపు తిరిగాయి. ఇంత సడన్‌గా నితీష్ కుమార్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ సాగుతోంది.
తాజాగా ఇదే అంశంపై ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ స్పందించారు. ఇక బీహార్‌లో జేడీయూ మనుగడ సాధించదని.. ఆ పార్టీ శకం ముగిసిందని ఆరోపించారు. నితీష్ కుమార్‌ను బీజేపీ హైజాక్ చేసిందని.. మిత్రులను తినేస్తోందని వ్యాఖ్యానించారు. ఓబీసీ లేదా అత్యంత వెనుకబడిన తరగతులకు చెందిన నాయకుడు ముఖ్యమంత్రి కావడం బీజేపీకి ఇష్టం లేదన్నారు. ప్రస్తుత పరిణామాలు ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా ఉన్నాయన్నారు. ఎన్నికల తర్వాత నితీష్ కుమార్‌ను ముఖ్యమంత్రిగా ఉండనివ్వదని తాము మొదటి నుంచి చెబుతూనే ఉన్నామని పేర్కొన్నారు.
Also Read
- Success story: గ్రామీణ నేపథ్యం, IIT చదువు లేదు.. కానీ, రూ. 2.6 కోట్ల ప్యాకేజీ సాధించిన కుర్రాడు..
- Karnataka: ‘‘చిల్లర లేకుపోతే దిగిపో..’’ మంత్రికే షాక్ ఇచ్చిన బస్ కండక్టర్..
- Monsoon: రైతులకు గుడ్ న్యూస్.. జోరందుకోనున్న రుతుపవనాలు.. జూలై 18-25 మధ్య భారీ వర్ష సూచన
- Tamil Nadu: కాంగ్రెస్ ద్రోహం చేసింది, విజయ్‌తో చేతులు కలిపేది లేదు: డీఎంకే.
ఇది కూడా చదవండి: Heat waves: తెలుగు రాష్ట్రాల్లో భానుడు భగభగలు.. హడలెత్తిపోతున్న ప్రజలు
‘‘మహారాష్ట్రలో ఏం జరిగింది? తొలుత ఏక్‌నాథ్ షిండే ముఖ్యమంత్రిగా ఉన్నారు. తర్వాత బీజేపీ హైజాక్ చేయలేదా? ఇప్పుడు బీహార్‌లో కూడా అదే జరిగింది. జేడీయూలోని కొంత మంది బీజేపీతో కుమ్మక్కయ్యారు. అందుకే ఇంత వేగంగా పరిణామాలు మారిపోయాయి.’’ అని తేజస్వి యాదవ్ చెప్పుకొచ్చారు. ఇక నితీష్ కుమార్ కొడుకు నిశాంత్ రాజకీయ ప్రవేశంపై స్పందిస్తూ.. ‘‘ఇప్పటికే ఆలస్యమైందని.. చాలా సంవత్సరాల క్రితమే వచ్చి ఉండాల్సింది. కొంత మంది కావాలనే అతడిని అడ్డుకున్నారు.’’ అని వ్యాఖ్యానించారు.
ఇది కూడా చదవండి: Sonu Sood: రంగంలోకి హీరో సోనూసూద్.. దుబాయ్‌లో చిక్కుకున్న వారికి ఉచిత వసతి!
#WATCH पटना: बिहार विधानसभा में विपक्ष के नेता तेजस्वी यादव ने कहा, "चुनाव में जिस तरह से उनकी जीत हुई है, धनतंत्र की, मशीनतंत्र की जीत हुई है…नीतीश कुमार ने कहा है कि वो (राज्यसभा)सदन जाना चाहते हैं…हम शरुआत से इस बात को कहते रहे हैं कि चुनाव के बाद नीतीश कुमार को भाजपा के… pic.twitter.com/33v3ZhH3N7
— ANI_HindiNews (@AHindinews) March 5, 2026
- Tags
- bihar
- JDU
- nitish kumar
- Rajya Sabha
- RJD
తాజావార్తలు
-
Srinivasa Mangapuram Trailer: మహేష్ బాబు ఫ్యామిలీ నుంచి కొత్త హీరో.. ట్రైలర్‌తోనే అంచనాలు పెంచేసిన జై కృష్ణ!
-
Tirupati Drugs Case : తిరుపతి డ్రగ్స్ కేసులో టీటీడీ ఉద్యోగి అరెస్ట్..
-
Success story: గ్రామీణ నేపథ్యం, IIT చదువు లేదు.. కానీ, రూ. 2.6 కోట్ల ప్యాకేజీ సాధించిన కుర్రాడు..
-
Bangladesh: మార్షల్ ఆర్ట్స్ పేరుతో ఉగ్రవాదం..
-
AP CM Chandrababu: ముంబైలో పవన్ కల్యాణ్‌ను పరామర్శించిన సీఎం చంద్రబాబు..
ట్రెండింగ్
-
Health Tips : వర్షాకాలంలో అల్లం-పసుపు టీ ఎందుకు తాగాలి.?
-
Team India Coach: టీమిండియా కోచింగ్ స్టాఫ్ నుంచి ఒకరు అవుట్.. నెక్స్ట్ ఎవరు?.. భారీ ప్రక్షాళన తప్పదా?
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..