Tejasvi Surya: డీలిమిటేషన్‌పై కావాలనే అలజడి సృష్టిస్తున్నారు.. విపక్షంపై తేజస్వీ సూర్య ఆరోపణలు
- డీలిమిటేషన్‌పై కావాలనే అలజడి సృష్టిస్తున్నారు
- దక్షిణాదికి మేలే తప్ప.. అన్యాయం జరగదు
- విపక్షంపై తేజస్వీ సూర్య ఆరోపణలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
డీలిమిటేషన్ బిల్లుపై దక్షిణ భారతదేశ ప్రజల్లో గందరగోళం వ్యాపింపజేస్తున్నారని బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య అన్నారు. డీలిమిటేషన్ బిల్లుపై చర్చ సందర్భంగా తేజస్వీ సూర్య మాట్లాడారు. డీలిమిటేషన్ బిల్లుపై అన్ని రాష్ట్రాలకు సమాన హక్కులు ఉన్నాయని తెలిపారు.
‘‘రాజ్యాంగం ప్రకారం డీలిమిటేషన్ తప్పనిసరి. డీలిమిటేషన్‌ను సాకుగా చూపించి మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. డీలిమిటేషన్‌తో దక్షిణాదికి అన్యాయం జరుగుతుందన్నది అవాస్తవం. కేరళలో 10 సీట్లు పెరుగుతున్నాయి. ఇది కేరళకు లాభమే కదా?, అలాగే ఏపీ, తెలంగాణలో కూడీ సీట్లు పెరగబోతున్నాయి. జీఎస్‌డీపీ ఆధారంగా సీట్లు పెంచాలని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఇది ఫూలిష్ ప్రతిపాదన. రేవంత్‌రెడ్డికి సలహా ఎవరిచ్చారో తెలియదు. 1996లో మొదలైన మహిళా రిజర్వేషన్ బిల్లు ఇప్పుడు కొలిక్కి వచ్చింది. డీలిమిటేషన్‌పై తమిళనాడు కావాలనే రాద్ధాంతం చేస్తోంది. 2029లో మహిళా రిజర్వేషన్ బిల్లు అమలుతో కొత్త చరిత్ర సృష్టించబోతున్నాం.’’ అని తేజస్వీ సూర్య చెప్పుకొచ్చారు.
Also Read
- Modi-Trump: మోడీ-ట్రంప్ ఫోన్ కాల్.. ట్రేడ్, డిఫెన్స్, ఎనర్జీపై కీలక చర్చలు!
- Central Cabinet: కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర కేబినెట్.. గ్రీన్ ఎనర్జీ కారిడార్-3కు ఆమోదం..
- Flydubai: హైజాక్ అలర్ట్‌తో ఇజ్రాయెల్‌లో కలకలం.. ‘‘శత్రువును వదలం’’ అంటూ మంత్రి హెచ్చరిక!
- Meerut Blue Drum Murder: మీరట్ డ్రమ్ మర్డర్ కేసు.. ముస్కాన్-సాహిల్ దోషులుగా నిర్ధారణ.!
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో భాగంగా గురువారం మహిళా రిజర్వేషన్ బిల్లు, నారీశక్తి వందన్ చట్టసవరణ, డీలిమిటేషన్ బిల్లులను కేంద్రం ప్రవేశపెట్టింది. 131 రాజ్యాంగ సవరణ బిల్లును సభలో ప్రవేశపెట్టాలా? వద్దా? అన్నదానిపై విపక్షాలు ఓటింగ్ కోరాయి. దీంతో అనుకూలంగా 207, వ్యతిరేకంగా 126 ఓట్లు వచ్చాయి. మహిళా రిజర్వేషన్ బిల్లుతో సహా మూడు బిల్లులకు అనుకూలంగా 207 ఓట్లు వచ్చాయి. ఎన్నికల్లో లబ్ధి కోసమే ఇంత హఠాత్తుగా బిల్లులు తీసుకొచ్చారని సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ఆరోపించారు.
ఇక నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్‌తో సహా మూడు బిల్లులపై రేపు సాయంత్రం 4 గంటలకు ఓటింగ్ జరుగుతుందని స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. ఓటు హక్కు రాజకీయ న్యాయమేనని న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ అన్నారు. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా మూడు బిల్లులూ చాలా ముఖ్యమైనవిగా పేర్కొన్నారు. మహిళల అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని వ్యాఖ్యానించారు. విధాన రూపకల్పనలో మహిళల పాత్ర అత్యంత అవసరం అని స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి: Beach: హద్దులు దాటిన జంట.. అందరూ చూస్తుండగా బీచ్‌లో అసభ్య ప్రవర్తన
తాజావార్తలు
-
Revanth Reddy: గత పదేళ్లు సిరిసిల్లను ఉరిసిల్లగా మార్చారు: సీఎం రేవంత్ రెడ్డి
-
Rohit Sharma: రికార్డుల కోట బద్దలు కొట్టిన రోహిత్ శర్మ.. క్రికెట్ హిస్టరీలోనే..
-
Modi-Trump: మోడీ-ట్రంప్ ఫోన్ కాల్.. ట్రేడ్, డిఫెన్స్, ఎనర్జీపై కీలక చర్చలు!
-
IND Vs WI: హాఫ్ సెంచరీలతో కదం తొక్కిన రోహిత్, గిల్.. శుభారంభం అందించిన ఓపెనర్స్..
-
Dhurandhar: ఇదెక్కడి ట్విస్ట్ .. సినిమా రిలీజ్ అయిన మళ్లీ సెన్సార్‌కి వెళ్లిన ‘ధురంధర్’ !
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!