Tejashwi Yadav: బ్యాలెట్‌తో ఎన్నికలు జరిపితే బీజేపీ గెలవదు.. తేజస్వి యాదవ్ కీలక వ్యాఖ్యలు
- బ్యాలెట్‌తో ఎన్నికలు జరిపితే బీజేపీ గెలవదు
- తేజస్వి యాదవ్ కీలక వ్యాఖ్యలు
- ఇండియా కూటమి భేటీ తర్వాత సంచలన వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బ్యాలెట్ పేపర్లతో ఎన్నికలు నిర్వహిస్తే బీజేపీ గెలవదని.. ఆ అవకాశమే ఉండదని ఆర్జేడీ నేత, బీహార్ అసెంబ్లీ ప్రతిపక్ష నేత తేజస్వి యాదవ్ అన్నారు. ఢిల్లీలో ఇండియా కూటమి సమావేశమైంది. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయం తీసుకున్నారు. సమావేశం అనంతరం తేజస్వి యాదవ్ మాట్లాడుతూ.. పలు అంశాలపై పూర్తి ఏకాభిప్రాయం కుదిరిందని.. వాటిపై ఉమ్మడిగా పోరాటం చేయాలని నిర్ణయించుకున్నామని తెలిపారు. “ఐదు కీలక అంశాలపై అన్ని పార్టీలు ఏకాభిప్రాయానికి వచ్చాయి. ఆ అంశాలను మేమంతా కలిసి బలంగా లేవనెత్తుతాం. ఈ విషయాల్లో ఇండియా కూటమి పూర్తిగా ఐక్యంగా ఉంది” అని చెప్పారు.
అదే సమయంలో ఎన్నికల నిర్వహణ విధానంపై కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. “ఎన్నికలను బ్యాలెట్ పేపర్లతో నిర్వహిస్తే బీజేపీకి గెలిచే అవకాశం ఉండదు” అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఉపయోగిస్తున్న ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లు (EVMలు) గురించి ప్రతిపక్షాలు వ్యక్తం చేస్తున్న సందేహాలను మరోసారి ప్రస్తావించిన ఆయన.. ఎన్నికల వ్యవస్థపై ప్రజల్లో విశ్వాసం పెంచేందుకు బ్యాలెట్ పేపర్ విధానాన్ని పునరుద్ధరించాలని సూచించారు.
Also Read
- Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
- Delhi High Court: పబ్లిసిటీ కోసం లాఠీ దెబ్బలు తింటారా? పోలీసులపై హైకోర్టు ఆగ్రహం
- CJP Protest: విద్యార్థుల నిరసనపై క్రికెటర్లు బుమ్రా, సూర్యకుమార్ భార్యల పోస్ట్‌లు వైరల్
- Lalit Modi: 16 ఏళ్ల తర్వాత భారత్ రాబోతున్న లలిత్ మోడీ..
తేజస్వి యాదవ్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఎన్నికల పారదర్శకత, ఈవీఎంల వినియోగం, బ్యాలెట్ పేపర్ విధానం వంటి అంశాలపై ఇప్పటికే దేశవ్యాప్తంగా రాజకీయ చర్చ జరుగుతున్న నేపథ్యంలో ప్రాధాన్యత సంతరించుకుంది. ఇండియా కూటమి రాబోయే రోజుల్లో ఈ అంశాలను మరింత బలంగా ప్రస్తావించే అవకాశమున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
- Tags
- ballot paper
- bjp
- Election
- evm
- INDIA Bloc
తాజావార్తలు
-
Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
-
Donald Trump: ఇరాన్ వంతెనలు, విద్యుత్ కేంద్రాలే టార్గెట్.. హార్ముజ్‌పై ట్రంప్ వార్నింగ్..
-
Zimbabwe Series: ఐపీఎల్ నుంచి ఆర్సీబీని తొలగించండి.. సెలెక్టర్లపై మండిపడ్డ మాజీ క్రికెటర్..
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Priyanka Chopra: ప్రియాంక చోప్రా బాలీవుడ్‌కు గుడ్‌బై చెప్పడానికి వాళ్లే కారణమట! వీడియో వైరల్..
ట్రెండింగ్
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Light Flip 5G Phone: సోషల్ మీడియా లేని 5G ఫోన్.. 50MP కెమెరాతో Light Flip కొత్త కాన్సెప్ట్.!