Bihar Elections: బీహార్ మాజీ మంత్రి, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమ్మాయితో లవ్‌లో ఉన్నానని ప్రకటించిన తర్వాత తేజ్ ప్రతాప్‌ను ఆర్జేడీ నుంచి బహిష్కరించారు. ఈ నేపథ్యంలో ఆయన జనశక్తి జనతాదళ్ (JJD) పార్టీని పెట్టారు. ఇదిలా ఉంటే, మళ్లీ ఆర్జేడీలోకి తిరిగి రావడంపై తేజ్ ప్రతాప్ మాట్లాడుతూ.. ‘‘తిరిగి వెళ్లడం కన్నా చనిపోవడమే బెటర్’’ అని చెప్పారు. పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యా్ఖ్యలు చేశారు.
Read Also: Saudi-Pakistan: కిరాయికి పాకిస్తాన్ సైన్యం.. సౌదీ అరేబియాతో ఒప్పందంలో కీలక విషయాలు..
తాను అధికారం కోసం కాదని, విలువలు, గౌరవాలు ముఖ్యమని, నేను ఆర్జేడీలోకి వెళ్లడం కన్నా మరణాన్ని ఎంచుకుంటానని, నాకు అధికార దాహం లేదని అన్నారు. విలువలు, ఆత్మ గౌరవం అత్యున్నతమైనవి అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం బీహార్ ఎన్నికల్లో ఆయన మహువా నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. తన తల్లిదండ్రుల ఆశీస్సులు తనకు ఎప్పుడూ ఉంటాయని అన్నారు.
తేజస్వీ యాదవ్‌ను ఇండియా కూటమి సీఎం అభ్యర్థిగా ప్రకటించడంపై స్పందిస్తూ.. వివిధ ప్రకటనలు చేయడం రాజకీయ నాయకుల లక్షణం, కానీ ప్రజల ఆశీస్సులు పొందిన వ్యక్తి మాత్రమే అధికారాన్ని దక్కించుకుంటారు అని అన్నారు. తాను ఎవరినీ శత్రువుగా పరిగణించనని, బీహార్ కోసం మాత్రమే పనిచేస్తానని చెప్పారు. బీజేపీ-ఆర్ఎస్ఎస్‌లో ప్రజలు మోసపోరని వ్యాఖ్యానించారు.
