Fakes Kidnapping: పరీక్షల్లో ఫెయిల్ అయింది.. కిడ్నాప్ డ్రామాకు తెర లేపింది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fakes Kidnapping: ఇటీవల కాలంలో ఎగ్జామ్ రిజల్ట్స్ లో ఫెయిల్ అవుతామో అని, ఫెయిలైన తర్వాత పలువురు విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడ్డారు. అయితే మధ్యప్రదేశ్ లో జరిగిన ఈ ఘటన అందుకు రివర్స్ లో ఉంది. అండర్ గ్యాడ్యుయేషన్ పరీక్షల్లో ఫెయిలైనందుకు ఏకంగా ఓ బాలిక కిడ్నాప్ డ్రామాకే తెరతీసింది. తల్లిదండ్రులు తిట్టకుండా ఉండాలని ఫేక్ కిడ్నాపింగ్ కు పాల్పడింది.
వివరాల్లోకి వెళితే 17 ఏళ్ల బాలిక బీఏ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ లో ఫేయిల్ అయింది. ఈ విషయం తెలిస్తే తల్లిదండ్రులు తిడతారనే భయంతో తాను కిడ్నాప్ అయినట్లు కథ అల్లింది. ఇండోర్ కు చెందిన బాలిక పక్కనే ఉన్న ఉజ్జయినికి పారిపోయింది. పరీక్ష ఫలితాలు వెలువడిన కొన్ని గంటల తర్వాత, కాలేజీ నుంచి ఇంటికి వస్తుండగా.. ఇండోర్ లోని ఓ ఆలయం సమీపంలో తన కుమార్తె అపహరణకు గురైందని బాలిక తండ్రి శుక్రవారం రాత్రి ఫిర్యాదు చేశారని, ఇండోర్ బంగంగా పోలీస్ స్టేషన్ అధికారి రాజేంద్ర సోని తెలిపారు.
Also Read
- Indian Railway: రైళ్లలో టికెట్ లేని ప్రయాణికులకు షాక్.. భారీగా జరిమానాలు..
- Nepal Floods: ఏం ఇళ్లురా ఇది, కట్టిన వాడికి ‘‘నేపాల్ రత్న’’ ఇవ్వాల్సిందే.. వరదల్లో చెక్కు చెదరలేదు.. వీడియో వైరల్..
- Karnataka: కర్ణాటక కాంగ్రెస్‌లో షాక్.. అవినీతి ఆరోపణలు.. కీలక మంత్రి రాజీనామా..
- Ganja Seized: ఒడిశా నుంచి యూపీకి కారులో గంజాయి తరలింపు.. ముగ్గురు అరెస్ట్..
Read Also: Dulquer: మలయాళ సూపర్ స్టార్ మరో తెలుగు సినిమా…
తన కుమార్తె ఫోన్ చేసి తాను కిడ్నాప్ కు గురైనట్లు చెప్పిందని అధికారులకు తెలియజేశాడు. కాలేజీలో పనిచేస్తున్న లెక్చరర్ తను ఆలయ సమీపంలో డ్రాప్ చేసినట్లు చెప్పింది. ఆ తరువాత ఒక ఆటో రిక్షాలో ఎక్కానని, ఆటో డ్రైవర్ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి నోటిలో గుడ్డలు పెట్టిన తర్వాత స్పృహ కోల్పోయానని సదరు బాలిక తండ్రికి చెప్పినట్లు పోలీసులు వెల్లడించారు. బాలిక చెప్పిన ప్రాంతంలోని సీసీ కెమెరాలను పరిశీలిస్తే అదంతా తేలిందని పోలీసులు తెలిపారు.
ఉజ్జయినిలో ఓ రెస్టారెంట్ లో ఒంటరిగా కూర్చున్న బాలిక గురించి అక్కడి పోలీసులు సమాచారం ఇచ్చారు. ఆమె ఫోటోను పంపించడంతో ఆమె ఉజ్జయినిలో ఉందని తెలుసుకుని పోలీసులు బాలికను ఇండోర్ తీసుకువచ్చారు. పోలీసులు ఆమెకు కౌన్సిలింగ్ ఇచ్చి కుటుంబసభ్యులకు అప్పగించారు. పరీక్షల్లో ఫెయిలై తల్లిదండ్రులను ఎదుర్కొనే పరిస్థితి లేకపోవడం వల్లే కిడ్నాప్ డ్రామా ఆడినట్లు విచారణలో తేలింది.
తాజావార్తలు
-
Indian Railway: రైళ్లలో టికెట్ లేని ప్రయాణికులకు షాక్.. భారీగా జరిమానాలు..
-
Story Board : నేపాల్ ఆకస్మిక వరదలకు కారణాలేంటి..? చైనా నిర్లక్ష్యం ఎంతవరకు ఉంది..?
-
OTR: ఎమ్మెల్యే, ఎంపీ.. మధ్యలో సూర్యలంక బీచ్!
-
OTR: ఆ నేతకు పీఏ పోట్లు.. ఆ ఎమ్మెల్యే చుట్టూ నడుస్తున్న అసలు డ్రామా!
-
OTR: సొంత పార్టీ నేతలకే టార్గెట్ అవుతున్న తెలంగాణ బీజేపీ సోషల్ మీడియా!
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్‌ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!