Hijab Row: కర్ణాటక రాష్ట్రంలోని ఉడిపి జిల్లాలోని కుందాపూర్‌లోని ప్రభుత్వ ప్రీ-యూనివర్సిటీ కళాశాల ప్రిన్సిపాల్ రామకృష్ణ బీజీకి 2024-25 సంవత్సరానికి గాను ఉత్తమ ప్రిన్సిపాల్ అవార్డును అందజేస్తున్నట్లు కర్ణాటక ప్రభుత్వం ప్రకటించింది. అయితే, దీనిపై రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. గత బీజీపీ ప్రభుత్వ హయాంలో చెలరేగిన హిజాబ్ వివాదానికి కారణమైన వారిలో రామకృష్ణ బీజీ కూడా ఉన్నారని ఆరోపిస్తూ సెలెక్టర్లు, విద్యావేత్తలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశాలు జారీ చేసింది.
Read Also: IT Minister Sridhar Babu: హైదరాబాద్ లో 200 ఎకరాల్లో AI సిటీ నిర్మాణం.. ఇది మా డ్రీమ్ ప్రాజెక్టు..
కాగా, సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఉడిపి కళాశాల ప్రిన్సిపాల్‌కు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. బీజేపీ ప్రభుత్వ హయాంలో తలెత్తిన హిజాబ్ వివాదంతో ప్రిన్సిపాల్ రామకృష్ణకు సంబంధం ఉందని.. గుర్తు తెలియని నంబర్ల నుంచి విద్వేషపూరిత సందేశాలు పంపి వివాదానికి కారణమయ్యారని ఆరోపించారు. అలాగే, SDPI దక్షిణ కన్నడ అధ్యక్షుడు అన్వర్ సాదత్ బజ్తూర్ ఎక్స్ లో ట్వీట్ చేస్తూ.. ముస్లిం బాలికలు హిజాబ్ ధరించి కళాశాలకు రాకుండా నిషేధించిన ప్రిన్సిపాల్ కు.. నెలల తరబడి వీధుల్లో నిరసన తెలపాల్సి వచ్చింది.. అలాంటి వ్యక్తికి ప్రిన్సిపాల్‌గా ఉండే హక్కులేదని చెప్పిన.. కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం ఆయనను అవార్డుకు ఎందుకు నామినేట్ చేసింది? అని ప్రశ్నించారు.
Read Also: Simi Singh: ప్రాణాలతో పోరాడుతున్న స్టార్ ఆల్‌రౌండర్.. దాతల కోసం ఎదురుచూపు! కోమాలోకి వెళ్లే ప్రమాదం
అయితే, 2022 సంవత్సరంలో కుందాపూర్ పీయూ కాలేజీలో హిజాబ్ ధరించి వచ్చినందుకు 28 మంది విద్యార్థినులను క్లాస్‌లోకి అనుమతించలేదు. అప్పటి నుంచి ఈ వివాదం రాజకీయ రంగు పులుముకుంది. దేశవ్యాప్తంగా ముస్లిం కళాశాల విద్యార్థులు వీధుల్లోకి వచ్చి.. ఆందోళన బాట పట్టారు. ఈ హిజాబ్ ధరించడంపై వివాదం ముస్లిం విద్యార్థులు, సామాజిక వేత్తలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగడంతో విద్యావ్యవస్థ కూడా పూర్తిగా అస్తవ్యస్తమైంది.