Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Teachers Day Award For Karnataka Principal Involved In Hijab Row Put On Hold

Hijab Row: హిజాబ్ వివాదంలో ప్రిన్సిపాల్.. అవార్డుపై కర్ణాటక సర్కార్ నిషేధం..!

Published Date :September 5, 2024 , 1:44 pm
By Chandra Shekhar Pamena
  • హిజాబ్ వివాదంలో చిక్కుకున్న కర్ణాటక ప్రిన్సిపాల్కు బెస్ట్ టీచర్స్ అవార్డు..
  • వివాదంలో ప్రీ-యూనివర్సిటీ కళాశాల ప్రిన్సిపాల్ ప్రమేయం ఉందని ఆరోపణలు..
  • ఈ అంశాన్ని క్షుణ్ణంగా విచారించిన తర్వాతే అవార్డుపై నిర్ణయం తీసుకుంటాం: కర్ణాటక మంత్రి
Hijab Row: హిజాబ్ వివాదంలో ప్రిన్సిపాల్.. అవార్డుపై కర్ణాటక సర్కార్ నిషేధం..!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Hijab Row: కర్ణాటక రాష్ట్రంలోని ఉడిపి జిల్లాలోని కుందాపూర్‌లోని ప్రభుత్వ ప్రీ-యూనివర్సిటీ కళాశాల ప్రిన్సిపాల్ రామకృష్ణ బీజీకి 2024-25 సంవత్సరానికి గాను ఉత్తమ ప్రిన్సిపాల్ అవార్డును అందజేస్తున్నట్లు కర్ణాటక ప్రభుత్వం ప్రకటించింది. అయితే, దీనిపై రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. గత బీజీపీ ప్రభుత్వ హయాంలో చెలరేగిన హిజాబ్ వివాదానికి కారణమైన వారిలో రామకృష్ణ బీజీ కూడా ఉన్నారని ఆరోపిస్తూ సెలెక్టర్లు, విద్యావేత్తలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశాలు జారీ చేసింది.

Read Also: IT Minister Sridhar Babu: హైదరాబాద్ లో 200 ఎకరాల్లో AI సిటీ నిర్మాణం.. ఇది మా డ్రీమ్ ప్రాజెక్టు..

కాగా, సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఉడిపి కళాశాల ప్రిన్సిపాల్‌కు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. బీజేపీ ప్రభుత్వ హయాంలో తలెత్తిన హిజాబ్ వివాదంతో ప్రిన్సిపాల్ రామకృష్ణకు సంబంధం ఉందని.. గుర్తు తెలియని నంబర్ల నుంచి విద్వేషపూరిత సందేశాలు పంపి వివాదానికి కారణమయ్యారని ఆరోపించారు. అలాగే, SDPI దక్షిణ కన్నడ అధ్యక్షుడు అన్వర్ సాదత్ బజ్తూర్ ఎక్స్ లో ట్వీట్ చేస్తూ.. ముస్లిం బాలికలు హిజాబ్ ధరించి కళాశాలకు రాకుండా నిషేధించిన ప్రిన్సిపాల్ కు.. నెలల తరబడి వీధుల్లో నిరసన తెలపాల్సి వచ్చింది.. అలాంటి వ్యక్తికి ప్రిన్సిపాల్‌గా ఉండే హక్కులేదని చెప్పిన.. కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం ఆయనను అవార్డుకు ఎందుకు నామినేట్ చేసింది? అని ప్రశ్నించారు.

Read Also: Simi Singh: ప్రాణాలతో పోరాడుతున్న స్టార్ ఆల్‌రౌండర్‌.. దాతల కోసం ఎదురుచూపు! కోమాలోకి వెళ్లే ప్రమాదం

అయితే, 2022 సంవత్సరంలో కుందాపూర్ పీయూ కాలేజీలో హిజాబ్ ధరించి వచ్చినందుకు 28 మంది విద్యార్థినులను క్లాస్‌లోకి అనుమతించలేదు. అప్పటి నుంచి ఈ వివాదం రాజకీయ రంగు పులుముకుంది. దేశవ్యాప్తంగా ముస్లిం కళాశాల విద్యార్థులు వీధుల్లోకి వచ్చి.. ఆందోళన బాట పట్టారు. ఈ హిజాబ్ ధరించడంపై వివాదం ముస్లిం విద్యార్థులు, సామాజిక వేత్తలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగడంతో విద్యావ్యవస్థ కూడా పూర్తిగా అస్తవ్యస్తమైంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Hijab Row
  • karnataka
  • Karnataka govt
  • Pre-University College principal
  • Teacher's Day award

తాజావార్తలు

  • Royal Enfield: రాయల్ ఎన్‌ఫీల్డ్ మొదటి ఎలక్ట్రిక్ బైక్ వచ్చేసింది.. ధర ఎంతో తెలుసా.?

  • Off The Record : కేక్ కోసం కొట్టుకున్నంత పనిచేశారా..?

  • Bumrah Vs Vaibhav: బుమ్రా బౌలింగ్ అంత భయంకరంగా ఏమీ లేదు.. వైభవ్ సూర్యవంశీ సంచలన వ్యాఖ్యలు..

  • Rajasekhar: శ్రీలీల కండిషన్.. రాజశేఖర్ షాక్! డాక్టర్ల మధ్య ‘మెడికల్’ ఒప్పందం వెనుక అసలు కథ ఇదే!

  • Off The Record: భోగాపురానికి దారేది.. కేంద్ర మంత్రి మీద గుస్సా అవుతున్న కమలం ఎమ్మెల్యే!

ట్రెండింగ్‌

  • Rare Fish: వలకు చిక్కిన అరుదైన చేప.. ఆనందంలో మత్స్యకారుడు.. ఎగబడిన జనం..

  • Jamun Seed Powder : ఆ కాలంలో షుగర్‌ కంట్రోల్‌కు నేరేడు గింజల పొడి వాడేవారు.. తయారీ విధానం ఇలా..!

  • TCS ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఏప్రిల్ 1 నుండి జీతాల పెంపు.!

  • Ai+ నుంచి కొత్త గాడ్జెట్ల వర్షం.. PulseTab ట్యాబ్, NovaPods, RotateCam స్మార్ట్‌వాచ్ లాంచ్..!

  • బడ్జెట్, మిడ్‌రేంజ్, ప్రీమియం.. Nova 2 5G, Ultra, Flip మోడళ్లతో Ai+ ఎంట్రీ..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions