UDAN Yatri Cafe: ఎయిర్‌పోర్టులో రూ.10కి టీ, రూ. 20కి సమోసా.. ఎలా సాధ్యమైందంటే..
- ఎయిర్‌పోర్టులో రూ.10కి టీ, రూ. 20కి సమోసా..
- ధరలను అరికట్టేందుకు కేంద్రం చర్యలు..
- ‘‘ఉడాన్ యాత్రి కేఫ్’’ ప్రారంభించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు..
- కోల్‌కతా ఎయిర్‌పోర్టులో పైలట్ ప్రాజెక్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
UDAN Yatri Cafe: విమానాశ్రయాల్లోకి వెళితే వాటర్ బాటిల్ దగ్గర నుంచి అల్పాహారం వరకు ధరలు మండిపోతుంటాయి. అయితే, వీటికి ఉపశమనం కల్పించేందుకు పౌర విమానయాన శాఖ కీలక చర్యలు తీసుకుంటోంది. కోల్‌కతాలోని సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమాన ప్రయాణికుల కోసం ‘‘ఉడాన్ యాత్రి కేఫ్’’ని సివిల్ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు. అధిక ధరల్ని నిరోధించడానికి, విమాన యాత్రికులకు అందుబాటులో ధరలు ఉంచాలని లక్ష్యంగా ఈ పైలట్ ప్రాజెక్టుని ప్రారంభించారు.
ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సహకారంతో ప్రారంభించబడిన ఈ కేఫ్‌లో బడ్జెట్‌కు అనుకూలంగా ఉంది. వాటర్ బాటిల్స్ రూ. 10, టీ రూ. 10, కాఫీ రూ. 20, సమోసా రూ. 20కి లభిస్తాయి. ప్రస్తుతం కోల్‌కతా ఎయిర్‌పోర్టులో పైలట్ ప్రాజెక్టు కింద ఈ ఉడాన్ యాత్రి కేఫ్ ప్రారంభించారు. క్రమక్రమంగా దేశంలోని అన్ని విమానాశ్రయాలకు దీనిని విస్తరించనున్నారు.
Also Read
- NALSAR row: CJI సూర్యకాంత్ ఆహ్వానంపై రచ్చ.. నల్సార్ విద్యార్థులకు బార్ కౌన్సిల్ షాక్..!
- Kolkata: కోల్‌కతా ఆస్పత్రిలో నర్సు మృతదేహం.. ఆర్జీకర్ తరహాలో కలకలం!
- Rahul Gandhi: అమెరికా-ఇరాన్‌లకు పాక్ మధ్యవర్తి.. మోడీ ఫారిన్ పాలసీపై రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు..
- Supreme Court: రెబల్ ఎంపీలపై పోరాటం.. సుప్రీంకోర్టులో పిటిషన్ వేయనున్న టీఎంసీ
Read Also: Maheshwar Reddy: సీఎం రేవంత్ రెడ్డికి బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి బహిరంగ లేఖ..
“ఉడాన్ యాత్రి కేఫ్ కేవలం ఫుడ్ అవుట్‌లెట్ మాత్రమే కాదు, ఇది ప్రజల కోసం ప్రయాణ అనుభవాన్ని అందరికి అందుబాటులోకి తీసుకురావడమే మా లక్ష్యం. సరసమైన ధరలకు కప్పు టీ, స్నాక్స్‌తో విమాన ప్రయాణాన్ని సుసంపన్నం చేయడం, అందరికీ అందుబాటులో ఉండేలా చేయడంలో మా నమ్మకాన్ని పునరుద్ఘాటిస్తున్నాము” అని మంత్రి చెప్పారు.
ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా ఇటీవల విమానాశ్రయాల్లో విపరీతమైన రేట్ల గురించి లేవనెత్తాన్నారు. ఆ తర్వాత కేంద్ర విమానయాన శాఖ నుంచి ఈ నిర్ణయం వచ్చింది. యాత్రి కేఫ్ ప్రారంభించడంపై చద్దా స్పందిస్తూ.. ఈ పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో విమానాశ్రయాల్లో ఆహార స్థోమత అంశాన్ని నేను హైలైట్ చేసిన తర్వాత కోల్‌కతా విమానాశ్రయంలో టీ ధరలు తగ్గించబడ్డాయి. ఇది మా ప్రజల విజయం, ఈ మార్పుకు ఉత్ప్రేరకం అయినందుకు నేను గర్వపడుతున్నానని అన్నారు. మరిన్ని విమానాశ్రయాల్లో ఈ సౌకర్యాన్ని తీసుకురావాలని ఆయన ఆశించారు.
తాజావార్తలు
-
NALSAR row: CJI సూర్యకాంత్ ఆహ్వానంపై రచ్చ.. నల్సార్ విద్యార్థులకు బార్ కౌన్సిల్ షాక్..!
-
Team India: టీమిండియా జట్టులోకి ముగ్గురు దిగ్గజ ఆటగాళ్లు..! ఎల్లుండే బరిలోకి..
-
NBK112: బాలయ్య – కొరటాల సినిమా క్యాన్సిలా! కారణం ఇదేనా?
-
CM Revanth Reddy: మీరు కొనుకున్న భూమి ఎక్కడికీ పోదు.. నేనే రిజిస్ట్రేషన్ చేయిస్తా: సీఎం రేవంత్ రెడ్డి
-
Kolkata: కోల్‌కతా ఆస్పత్రిలో నర్సు మృతదేహం.. ఆర్జీకర్ తరహాలో కలకలం!
ట్రెండింగ్
-
బ్లాక్ డిజైన్, హైబ్రిడ్ పవర్‌తో Toyota Hyryder Aero Black Edition వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే..!
-
5,000 నిట్స్ డిస్ప్లే, 50MP కెమెరాలు, 6,500mAh బ్యాటరీతో Vivo X300 FE కొత్త వేరియంట్ లాంచ్..!
-
Airtel Recharge Plans: రూ.299 సహా 4 ప్రీపెయిడ్ ప్లాన్లు తొలగింపు.. ఇకపై కొత్త ఆప్షన్లు ఇవే.!
-
Money Plant Growing Tips: మానీ ప్లాంట్ వేగంగా, గుబురుగా పెరగాలంటే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి.!
-
CSK Head Coach: సీఎస్కే హెడ్ కోచ్‌గా వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్!