NTV Telugu Site icon

సవాల్ గా మారిన పెను తుఫాన్ 

అరేబియా సముద్రంలో ఏర్పడిన వాయుగుండం తుఫాన్ గా మారిన సంగతి తెలిసిందే.  ఈ తుఫాన్ ఇప్పుడు పెను తుఫాన్ గా మారి అరేబియా తీరప్రాంతంలోని రాష్ట్రాలపై విరుచుకుపడింది. ఇప్పటికే కేరళ, తమిళనాడులోని కన్యాకుమారి, మహారాష్ట్ర, గోవా రాష్ట్రాలపై ప్రభావం చూపించింది.  ప్రస్తుతం తీవ్రమైన తుఫాన్ గా మారి గుజరాత్ వైపు పయనిస్తోంది టౌటే తుఫాన్.  ఈరోజు సాయంత్రం వరకు టౌటే తుఫాన్ గుజరాత్ తీరాన్ని చేరుతుంది. దీంతో ఆ రాష్ట్రంలోని 15 జిల్లాలను అక్కడి ప్రభుత్వం అప్రమత్తం చేసింది. ఎలాంటి విపత్తు సంభవించిన రక్షణ చర్యలు తీసుకోవడానికి సిద్ధం అయ్యింది.  తుఫాన్ ప్రభావిత ప్రాంతంలోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.  పెను తుఫాన్ కారణంగా ఈరోజు రేపు రాష్ట్రంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను నిలిపివేశారు.  ఈ పెను తుఫాన్ ఇప్పుడు గుజరాత్ రాష్ట్రానికి పెను సవాల్ గా మారింది.  పెద్ద ఎత్తున తుఫాన్ విరుచుకుపడి విధ్వంసం సృష్టిస్తే దాని నుంచి కోలుకొని తిరిగి యధా స్థితికి తీసుకురావడానికి చాలా సమయం పట్టే అవకాశం ఉన్నది.  ఒకవైపు కరోనా, మరోవైపు తుఫాన్ విధ్వంసం నుంచి గుజరాత్ ఎలా బయటపడుతుందో చూడాలి.