ఇటీవల అరేబియా సముద్రంలో ఏర్పడిన టౌక్టే తుఫాన్ ఎంతటి విధ్వంసాన్ని సృష్టించిందో చెప్పాల్సిన అవసరం లేదు. ఈ తుఫాను ధాటికి పశ్చిమ తీర ప్రాంతం రాష్ట్రాలు అతలాకుతలం అయ్యాయి. వేల కోట్ల రూపాయల నష్టం సంభవించింది. టౌక్టె తుఫాను బీభత్సం నుంచి ఇంకా కోలుకోక ముందే మరో ముప్పు దూసుకు రాబోతున్నది. ఈసారి తూర్పు తీరంలో ఆ ముప్పు ఉండబోతున్నట్టు వాతావరణ శాఖ పేర్కొన్నది. తూర్పు తీరంలోని అండమాన్ కు ఉత్తరాన సముద్రంలో ఈనెల 22 వ తేదీన అల్పపీడనం ఏర్పడే…
టౌటే తుఫాన్ ఈనెల 18 వ తేదీన గుజరాత్ తీరాన్ని దాటింది. తరాన్ని దాటే సమయంలో భారీ విధ్వంసం సృష్టించింది. బలమైన ఈదురు గాలులు వీచాయి. గంటకు 150 నుంచి 165 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. అహ్మదాబాద్ నగరంపై టౌటే తుఫాన్ ప్రభావం స్పష్టంగా కనిపించింది. ఈ తుఫాన్ ధాటికి నగరం అల్లకల్లోలం అయింది. బలమైన గాలులతో కూడిన వర్షం కురవడంతో అహ్మదాబాద్ నగరంలో అనేక ప్రాంతాలు నీట మునిగాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. …
టౌటే తుఫాన్ ధాటికి పశ్చిమ తీరం అతలాకుతలం అయింది. కన్యాకుమారి నుంచి కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, గోవా, గుజరాత్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పశ్చిమ తీరాన్ని తాకే సమయంలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. పెద్ద ఎత్తున అలలు విరుచుకుపడ్డాయి. ఇక ముంబై మహానగరాన్ని ఈ టౌటే తుఫాన్ వణికించింది. పెద్ద ఎత్తున ఈదురు గాలులు వీయడంతో పాటుగా భారీ వర్షం కురిసింది. టౌటే తుఫాన్ గుజరాత్ తీరాన్ని దాటడానికి రెండు గంటల సమయం పట్టింది. ముంబై…
టౌటే తుఫాన్ ధాటికి తీరప్రాంతాలు అతలాకుతలం అవుతున్నాయి. తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలు ఆ తుఫాన్ ధాటికి చిగురుటాకులా వణుకుతున్నాయి. ఇక, దీని ప్రభావం తెలుగురాష్ట్రాలపై పడింది. హైదరాబాద్‌లో ఈ ఉదయం నుంచి భారీ వర్షం కురుస్తున్నది. ఉదయం నుంచి పెద్ద ఎత్తున వర్షం కురుస్తుండటంతో ప్రజలు అతలాకుతలం అవుతున్నారు. లాక్‌డౌన్ సడలింపుల సమయంలో భారీ వర్షం కురుస్తుండటంతో బయటకు రావాలంటే భయపడుతున్నారు. ఉదయం 5 గంటల నుంచే భారీ వర్షం కురవడం మొదలైంది. బంజారాహిల్స్,…
అరేబియా సముద్రంలో ఏర్పడిన వాయుగుండం తుఫాన్ గా మారిన సంగతి తెలిసిందే. ఈ తుఫాన్ ఇప్పుడు పెను తుఫాన్ గా మారి అరేబియా తీరప్రాంతంలోని రాష్ట్రాలపై విరుచుకుపడింది. ఇప్పటికే కేరళ, తమిళనాడులోని కన్యాకుమారి, మహారాష్ట్ర, గోవా రాష్ట్రాలపై ప్రభావం చూపించింది. ప్రస్తుతం తీవ్రమైన తుఫాన్ గా మారి గుజరాత్ వైపు పయనిస్తోంది టౌటే తుఫాన్. ఈరోజు సాయంత్రం వరకు టౌటే తుఫాన్ గుజరాత్ తీరాన్ని చేరుతుంది. దీంతో ఆ రాష్ట్రంలోని 15 జిల్లాలను అక్కడి ప్రభుత్వం అప్రమత్తం చేసింది. ఎలాంటి విపత్తు…
అరేబియా సముద్రంలో ఏర్పడిన వాయుగుండం తీవ్రమైన తౌక్టే తుఫానుగా మారింది. ప్రస్తుతం ఈ తుఫాను గోవాకు 222 కిలో మీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. దీని ప్రభావం కారణంగా ప్రస్తుతం కేరళలో భారీ వర్షాలు గాలులు వీస్తున్నాయి. కేరళలో 9 జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. భారీ వర్షాల ధాటికి విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. ఈనెల 18 వ తేదీన గుజరాత్ లోని పోర్ బందర్, నలియా మధ్య తీరం దాటే అవకాశం ఉన్నది. దీంతో గుజరాత్ లోని…