అరేబియా సముద్రంలో ఏర్పడిన వాయుగుండం తుఫాన్ గా మారిన సంగతి తెలిసిందే. ఈ తుఫాన్ ఇప్పుడు పెను తుఫాన్ గా మారి అరేబియా తీరప్రాంతంలోని రాష్ట్రాలపై విరుచుకుపడింది. ఇప్పటికే కేరళ, తమిళనాడులోని కన్యాకుమారి, మహారాష్ట్ర, గోవా రాష్ట్రాలపై ప్రభావం చూపించింది. ప్రస్తుతం తీవ్రమైన తుఫాన్ గా మారి గుజరాత్ వైపు పయనిస్తోంది టౌటే తుఫాన్. ఈరోజు సాయంత్రం వరకు టౌటే తుఫాన్ గుజరాత్ తీరాన్ని చేరుతుంది. దీంతో ఆ రాష్ట్రంలోని 15 జిల్లాలను అక్కడి ప్రభుత్వం అప్రమత్తం చేసింది. ఎలాంటి విపత్తు…