POK: పీఓకేను శ్మశానంగా మార్చారు.. UNలో గర్జించిన కాశ్మీర్ మహిళ..
- UNHRC పీఓకే అంశంపై ప్రస్తావన..
- పాక్ అణిచివేతపై గర్జించిన కాశ్మీర్ మహిళ..
- పీఓకేని శ్మశానంగా మార్చారని ఆరోపణ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
POK: ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి (UNHRC)లో పాకిస్తాన్ అరాచకాలపై కాశ్మీరీ మహిళ గర్జించింది. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్(POK)లో పాక్ వ్యవహరిస్తున్న తీరుపై బారాముల్లాకు చెందిన సామాజిక-రాజకీయ కార్యకర్త తస్లీమా అఖ్తర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శాంతియుతంగా ప్రాథమిక హక్కులు కోరుతున్న ప్రజలపై పాకిస్తాన్ భద్రతా బలగాలు కాల్పులు జరిపాయని ఆరోపించారు. ప్రతీ మరణంపై స్వతంత్ర విచారణ జరపాలని ఆమె డిమాండ్ చేశారు.
జెనీవాలో జరిగి. 63వ UNHRC సమావేశంలో ఆమె మాట్లాడారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్లో జరుగుతున్న ఉద్యమంపై అణచివేతపై పలు పౌరసంఘాలు, కార్యకర్తలు ప్రస్తావించారు. తస్లీమా అఖ్తర్ ‘‘అసోసియేషన్ ఆఫ్ టెర్రర్ విక్టిమ్స్ ఇన్ పాకిస్తాన్(ATVK)’’ సంబంధం ఉన్న కార్యకర్త. పీఓకేలో తమ హక్కుల్ని సాధించుకోవడానికి జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ ఉద్యమాన్ని చేపట్టింది. ఈ ఉద్యమాన్ని పాక్ క్రూరంగా అణచివేసింది.
Also Read
- Mamata Banerjee: బెంగాల్లో మళ్లీ ఎన్నికలు, జ్ఞానేశ్ కుమార్ అరెస్టు.. మమత సంచలన డిమాండ్..
- Best Places to Visit in India in October: అక్టోబర్‌లో ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ 10 ప్రదేశాలు అస్సలు మిస్ కావొద్దు..
- BJP: ‘‘ఓట్ చోరీ జరిగితే మేం ఎలా ఓడిపోయాం’’.. కాంగ్రెస్‌కు బీజేపీ కౌంటర్..
- Bombay High Court: మత ఊరేగింపుల్లో బాణసంచా కాల్చొద్దు.. డీజేలు, లేజర్ బీమ్స్పై బాంబే హైకోర్టు కీలక ఆదేశాలు
పాకిస్తాన్ కాశ్మీర్ ప్రజల ప్రయోజనం కోసం నిజంగా పనిచేయదని, మొదట ఉగ్రవాదుల్ని పంపి జమ్మూ కాశ్మీర్‌ను శ్మశానంగా మార్చేందుకు ప్రయత్నించారని, ఇప్పుడు నిరాయుధ, అమాయక నిరసనకారుల్ని చంపుతూ పీఓకేను శ్మశానంగా మార్చారని ఆమె అన్నారు. వేలాది మంది కార్యకర్తల్ని అరెస్ట్ చేశారని, కీలక నాయకుల్ని నిర్బంధించారని, ఇంటర్నెట్ సేవల్ని నిలిపేశారని ఆమె ఆరోపించారు. హింసాత్మక ఘటనల్లో సాధారణ ప్రజలు మరణించినట్లు చెప్పారు.
పీఓకే ప్రజల తరుఫున నేరుగా మాట్లాడే ప్రతినిధులు యూఎన్‌లో లేరని తస్లీమా అన్నారు. దీనికి బదులుగా లండన్‌లో ఉన్న కొందర్ని తీసుకువచ్చిన ఆ ప్రాంతంపై పాకిస్తాన్ అనుకూల కథనాలను సృష్టిస్తున్నారని ఆమె ఆరోపించారు. పీఓకేలో ప్రజలు తమ సమస్యల్ని స్వేచ్ఛగా వ్యక్తం చేసే అవకాశం లేదని అన్నారు. పౌరుల హత్యలు, ప్రతీకార చర్యల్ని వెంటనే నిలిపేయాలని ఆమె డిమాండ్ ఐక్యరాజ్యసమితి సమావేశంలో కోరారు.
తాజావార్తలు
-
POK: పీఓకేను శ్మశానంగా మార్చారు.. UNలో గర్జించిన కాశ్మీర్ మహిళ..
-
Harish Rao: కాంగ్రెస్ ప్రభుత్వం చేతగాక రైతాంగం కన్నీళ్లు పెడుతోంది
-
Paradise First Review: థియేటర్లు బ్లాస్ట్.. ‘ది ప్యారడైజ్’ లాస్ట్ 40 నిమిషాలు నాని ర్యాంపేజ్.. ఆ పాపులర్ హీరో సర్ ప్రైజ్ క్యామియో!
-
Baahubali : ఫౌజీ మరో బాహుబలి?
-
Mamata Banerjee: బెంగాల్లో మళ్లీ ఎన్నికలు, జ్ఞానేశ్ కుమార్ అరెస్టు.. మమత సంచలన డిమాండ్..
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!