Site icon NTV Telugu

Tarique Rahman: తారిక్ రెహ్మాన్‌కు మోడీ లేఖ.. బంగ్లా కొత్త ప్రధానికి భారత్ ఆహ్వానం..

Pm Modi

Pm Modi

Tarique Rahman: బంగ్లాదేశ్ కొత్త ప్రధానిగా తారిఖ్ రెహ్మాన్ ఈ రోజు ప్రమాణస్వీకారం చేశారు. రెండేళ్లుగా బంగ్లాలో ఉన్న అనిశ్చితి పరిస్థితుల మధ్య ఇటీవల ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో బీఎన్పీ పార్టీ ఘన విజయం సాధించింది. ఆ పార్టీ అధ్యక్షుడైన రెహ్మాన్ బంగ్లా కొత్త ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. ఈ ప్రమాణస్వీకార కార్యక్రమానికి భారత్ తరుపున లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా హాజరయ్యారు. బంగ్లా ప్రధానికి భారత ప్రధాని నరేంద్రమోడీ రాసిన లేఖను అందచేశారు.

Read Also: Maruti Suzuki Brezza: మారుతి సుజుకి బ్రెజ్జా కొనాలనుకుంటున్నారా.. మరికొన్ని రోజులు ఆగండి..

“బంగ్లాదేశ్‌లో ఇటీవల ముగిసిన పార్లమెంటరీ ఎన్నికల్లో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ విజయం సాధించినందుకు, బంగ్లాదేశ్ తదుపరి ప్రధానమంత్రిగా మీరు నియమితులైనందుకు నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను” అని ప్రధాని మోదీ రాసిన లేఖలో పేర్కొన్నారు. పరస్పర అనుకూల సమయంలో భారత్‌ను సందర్శించాలని మోడీ, తారిఖ్ రెహ్మాన్‌ను ఆహ్వానించారు. రెహమాన్‌తో పాటు ఆయన భార్య డాక్టర్ జుబైదా, ఆయన కుమార్తె జైమాలను కూడా మోడీ తన లేఖలో ఆహ్వానించారు. భారత్ మీకు హృదయపూర్వక స్వాగతం కోసం ఎదురుచూస్తోందని చెప్పారు.

Exit mobile version