Tamil Nadu: ఇదేం పద్ధతి? బాలిక హత్య కేసు ప్రెస్మీట్లో పోలీసులు వెకిలి నవ్వులు.. వీడియో వైరల్
- బాలిక హత్య కేసు ప్రెస్మీట్లో పోలీసులు అనుచిత ప్రవర్తన
- సాధారణంగా సంభాషించు కుంటూ నవ్వుకున్న పోలీసులు
- పోలీసుల తీరుపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళనాడులో ఇటీవల 10 ఏళ్ల బాలికపై అత్యాచారం, హత్య ఘటన యావత్తు దేశాన్ని కుదిపేసింది. కొత్తగా ఏర్పడిన విజయ్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో నిందితులను కఠినంగా శిక్షించాలని ముఖ్యమంత్రి విజయ్ పోలీసులకు ఆదేశించారు. అయితే తాజాగా పోలీసులు వ్యవహరించిన తీరు ఇప్పుడు నెట్టింట తీవ్ర ఆగ్రహానికి గురి చేసింది. సోషల్ మీడియా వేదికగా పోలీసులపై దుమ్మెత్తిపోస్తున్నారు.
మే 21న కోయంబత్తూరులో 10 ఏళ్ల బాలికపై అత్యాచారం, హత్య కేసు సంచలనం సృష్టించింది. అయితే సోమవారం ఈ ఘటనపై పోలీసులు ప్రెస్‌మీట్ నిర్వహించారు. వెస్ట్ జోన్ ఐజీ ఆర్.వి. రమ్య భారతి, కోయంబత్తూరు రేంజ్ డీఐజీ పి. సమినాథన్, కోయంబత్తూరు ఎస్పీ అల్లటిపల్లి పవన్ కుమార్ రెడ్డి కలిసి పత్రికా సమావేశం నిర్వహించారు. అయితే ఒక సీరియస్ మేటర్‌పై ప్రెస్‌మీట్ నిర్వహిస్తున్నామన్న ఇంకిత జ్ఞానం లేకుండా.. ముగ్గురూ కూడా సాధారణ సంభాషణలో మునిగిపోయారు. రమ్య భారతి గోళ్లు గిల్లుకుంటూ.. జోకులు వేసుకుంటూ.. నవ్వుతూ కనిపించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలోకి రాగానే.. వేగంగా వైరల్ అయింది. దీంతో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి.
Also Read
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
- BJP MP: త్వరగా పెళ్లి చేసుకుని ఐదుగురు పిల్లల్ని కనాలి.. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు..
“ఇంత తీవ్రమైన కేసు గురించి మాట్లాడుతున్నప్పుడు ఇలా నవ్వడం ఏంటి? ఇది అసమర్థత” అని ఒకరు వ్యాఖ్యానించగా, మరొకరు “10 ఏళ్ల చిన్నారి హత్యపై ఇంత నిర్లక్ష్యమా? ఇది అతి అవమానకరం” అని పేర్కొన్నారు. మరికొందరు “ఇలాంటి అధికారులు ఈ పదవులకు అర్హులు కారు” అని విమర్శించగా.. “సివిల్ సొసైటీగా మనం విఫలమయ్యాం” అంటూ మరికొందరు ఆవేదన వ్యక్తం చేశారు. ఇంతలో తమిళనాడు పరిశ్రమల మంత్రి ఎస్. కీర్తన కూడా ఈ కేసు నేపథ్యంలో విమర్శలకు గురయ్యారు. మీడియా ప్రశ్నలకు స్పందించిన సమయంలో ఆమె కూడా నవ్వినట్లు కనిపించడంతో బీజేపీ తీవ్రంగా మండిపడింది. అయితే మీడియా సమావేశం ముగిసిన తర్వాతే ఆ నవ్వు వచ్చిందని ఆమె వివరణ ఇచ్చారు.
తాజావార్తలు
-
Trivikram : గురూజీకి హనుమాన్ అన్ష్ టెన్షన్!
-
Quba Pub Fight: విశాఖ ‘క్యూబా’ పబ్‌లో రచ్చరచ్చ.. డ్యాన్స్ వివాదంతో మొదలై రోడ్డుపైకి చేరిన రగడ..
-
The Paradise OTT: సిల్వర్ స్క్రీన్‌పై ‘ది ప్యారడైజ్’లో మిస్సయిన ఆ పాట.. నెట్‌ఫ్లిక్స్ కోసం శ్రీకాంత్ ఓదెల మాస్టర్ స్కెచ్!
-
Srikanth Odela: “ఎవర్రా నువ్వు.. ఏంది నీ గోల?”.. శ్రీకాంత్ ఓదెల మొండితనం చూసి సుకుమార్ షాక్!
-
Smart Roads: వాహనదారులకు శుభవార్త.. అమరావతిలో సరికొత్త స్మార్ట్ రోడ్లు.. ఈ ప్రాంతాల్లో..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!