Kallakurichi tragedy: ప్రభుత్వం మద్యంలో ‘‘కిక్కు’’ తగ్గింది.. అందుకే కల్తీ మద్యం తాగారు..
- ప్రభుత్వ మద్యంలో కిక్కు లేదు..
- అందకే ప్రజలు కల్తీ మద్యం వైపు..
- కళ్లకురిచి విషాదం నేపథ్యంలో మంత్రి వ్యాఖ్యలు..
- తప్పుపట్టిన ప్రతిపక్షాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kallakurichi tragedy: ఇటీవల తమిళనాడులోని కళ్లకురిచి జిల్లాలో కల్తీ మద్యం తాగి 60 మందికి పైగా మరణించారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఒకే జిల్లాలో ఇంత మంది చనిపోవడంపై అధికార డీఎంకే పార్టీ, సీఎం స్టాలిన్‌పై బీజేపీ, అన్నాడీఎంకే పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ సీఎం రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా తమిళనాడు మంత్రి దురైమురుగన్ శనివారం సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే టాస్మాకర్ మద్యంలో ‘‘కిక్’’ లేకపోవడం వల్లే ప్రజలు అక్రమ మద్యాన్ని తాగుతున్నారని అన్నారు. ప్రభుత్వం విక్రయించే మద్యాన్ని రోజూవారీ కూలీలు సాఫ్ట్ డ్రింక్స్‌తో పోల్చుతున్నారని అన్నారు.
Read Also: West Bengal: నడిరోడ్డుపై మహిళను కొట్టిన తృణమూల్ నేత.. మమతా బెనర్జీపై బీజేపీ ఫైర్..
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
- Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ మంత్రి ఎస్ ముత్తుసామి శనివారం రాష్ట్ర అసెంబ్లీలో ప్రొహిబిషన్ యాక్ట్‌ను బలోపేతం చేసే బిల్లును ప్రవేశపెట్టిన తర్వాత దురైమురుగన్ వ్యాఖ్య చేశారు. ఈ బిల్లు ద్వారా కల్తీ మద్యాన్ని విక్రయించే వారికి 10 సంవత్సరాల వరకు కఠిన కారాగార శిక్ష మరియు రూ. 10 లక్షల వరకు జరిమానాతో సహా కఠినమైన శిక్షలను అమలు చేస్తుంది. 65 మందిని బలిగొన్న కళ్లకురిచి ఘటన తర్వాత ప్రభుత్వం ఈ బిల్లును తీసుకువచ్చింది.
ఈ బిల్లుపై చర్చ సందర్భంగా పట్టాలి మక్కల్ కట్చి(పీఎంకే) ఎమ్మెల్యే జీకే మణి రాష్ట్రంలో సంపూర్ణ మద్యపాన నిషేధానికి పిలుపునిచ్చారు. దీనిపై మంత్రి ముత్తుస్వామి స్పందిస్తూ.. తమిళనాడులో పరిస్థితి సంపూర్ణ నిషేధాన్ని అమలు చేయడానికి అనుకూలంగా లేదని అన్నారు. మరో మంత్రి దురైమురుగన్ మాట్లాడుతూ కష్టపడే వారికి మద్యం అవసరమని చెప్పారు. హూచ్ దుర్ఘటనలో అధికార డీఎంకే అసమర్థతే మరణాలకు కారణమని ఏఐఏడీఎంకే అధికార ప్రతినిధి కోవై సత్యన్ ఆరోపించారు. దురైమురుగన్ వ్యాఖ్యలు తమ “అసమర్థ” నాయకుడైన ఎంకె స్టాలిన్‌ను రక్షించుకోవాలనే డీఎంకే తెగ ప్రయత్నిస్తోందని అన్నారు.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..