వారందరూ బ్యాంక్ ఉద్యోగులు. అందులో ఎల్లప్పుడు నమ్మకంగా పనిచేసేవాల్లు. కానీ.. బ్యాంక్‌కే కన్నం వేయాలని స్కెచ్ వేశారు. అందులో పనిచేసే ముగ్గురు ఒకటై బ్యాంక్ లో చోరీ ఎలా చేయాలో ప్లాన్ వేసుకున్నారు. యధాతతంగానే బ్యాంక్ కు వచ్చిన వారు బ్యాంక్‌లో బంగారం, నగదును దోచుకుని పరార్ అయ్యారు. ఈ భారీ దొంగతనం తమిళనాడులోని చెన్నై అరుంబాక్కంలోని ఫెడ్ జువెలరీ లోన్ కంపెనీలో పట్టపగలే ఈఘటన చోటుచేసుకోవడం కళకలం రేపుతుంది.
చోరీ ప్లాన్- ఎలా జరిగిందిః
రెండు ద్విచక్ర వాహనాల్లో మొత్తం ముగ్గురు వ్యక్తులు వచ్చారు. సెక్యూరిటీ గార్డు, సిబ్బందిని తాడుతో కట్టేసి, మత్తు మందు ఇచ్చారు. వారు అనుకున్న ప్లాన్ ప్రకారం బ్యాంక్ లో చొరబడి రూ.20కోట్ల విలువైన బంగార ఆభరణాలు, నగదు దోచుకున్నారు. అక్కడనుంచి పరార్ అయ్యారు. బ్యాంక్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించడంతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నాలుగు బృందాలుగా ఏర్పడి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈవ్యావహారం సీరియస్ గా తీసుకున్న అడిషనల్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్ స్వయంగా దర్యాప్తులో భాగమయ్యారు. ఈబ్యాంకులో పనిచేసేవారే దొంగతనం చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. బ్యాంక్ ఉద్యోగి మురుగన్ చోరీ ప్రధాన సూత్రధారిగా పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని దర్యాప్తు చేస్తున్నామని, నిందితులను త్వరలో పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.
Indian Independence Day: ఉగ్రదాడులకు పాకిస్తాన్ ప్లాన్.. ఖలిస్తానీ ఉగ్రవాదులపై ఒత్తడి