Tamilnadu Elections Exit Poll 2026: తమిళనాడులో స్టాలిన్‌ హవా.. చతికిలపడిన అన్నాడీఎంకే, టీవీకే..

Mk Stalin

Mk Stalin

Tmil Nadu Elections Exit poll 2026: నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతానికి జరిగిన అసెంబ్లీ ఎన్నికలు నేటితో పూర్తయ్యాయి. ఈ ఎన్నికల్లో రికార్డ్ స్థాయి ఓటింగ్ నమోదైంది. అస్సాం, కేరళం, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, పుదచ్చేరిలో ఎవరు గెలుస్తారా? అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మే 04న తుది ఫలితాలు రాబోతున్నాయి.

అస్సాం, కేరళ, పుదుచ్చేరిలలో ఏప్రిల్ 9న పోలింగ్ జరగ్గా, తమిళనాడులో కూడా ఏప్రిల్ 23న ఒకే దశలో పోలింగ్ నిర్వహించారు. బెంగాల్‌లో రెండు దశల్లో మొదటి దశ ఏప్రిల్ 23న జరిగింది. రెండో దశ బుధవారం(ఏప్రిల్29)న జరిగింది. వెస్ట్ బెంగాల్‌లో 294, అస్సాంలో 126, తమిళనాడులో 234, కేరళలో 140, పుదుచ్చేరిలో 30 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగాయి.

తమిళనాడులో మరోసారి ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే కూటమి అధికారంలోకి వస్తుందని అన్ని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తున్నాయి.  అన్నాడీఎంకే మరోసారి ప్రతిపక్షానికే పరిమితం కానుంది. ఎన్నో అంచనాలతో వచ్చిన విజయ్ టీవీకే చతికిలపడింది.