Tamil Nadu: అంతా ఫ్రీ ఫ్రీ ఫ్రీ.. ఫ్రిజ్‌లు, ల్యాప్‌టాప్‌లు, పంపు సెట్లు.. తమిళనాడు ప్రజలపై వరాల జల్లు..
- తమిళనాడు ఓటర్లపై ఉచితాల వర్షం..
- ఫ్రీ ఫ్రిజ్, ఫ్రీ ల్యాప్‌టాప్, ఫ్రీ పంపు సెట్లు..
- డీఎంకే, అన్నాడీఎంకే, టీవీకేలు ఉచితాల బాటలో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tamil Nadu: తమిళనాడు ఎన్నికలు అంటేనే ‘‘ఉచితాలు’’. ఓటర్లను ఆకట్టుకోవడానికి అన్ని పార్టీలు కూడ ఉచితాలనే ఉపయోగిస్తుంటాయి. మరికొన్ని రోజుల్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఫ్రీ హామీలు వర్షంలా కురస్తున్నాయి. అధికార డీఎంకేతో పాటు ప్రతిపక్ష అన్నాడీఎంకే ఓటర్లపై హామీల వర్షాన్ని కురిపిస్తోంది. తాము అధికారంలోకి వస్తే ఉచితంగా ఫ్రిజ్ ఇస్తామని అన్నాడీఎంకే చెబితే, డీఎంకే విద్యార్థినులకు ఉచిత ల్యాప్‌టాప్‌లు అంటూ ఊదరగొడుతోంది. డీఎంకేతో పోలిస్తే అన్నాడీఎంకే ఉచితాల్లో ముందుంది.
* తాము అధికారంలోకి వస్తే రేషన్ కార్డు ఉన్న ప్రతీ ఒక్కరికి ఉచితంగా రిఫ్రిజ్‌రేటర్ అందిస్తామని పళనిస్వామి హామీ ఇచ్చారు.
* డీఎంకే ప్రతీ నెల కుటుంబానికి రూ. 1000 ఇస్తుంటే, అన్నాడీఎంకే రూ. 2000 ఇస్తామని చెబుతోంది.
* డీఎంకే కేవలం బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని కల్పిస్తుంటే, అన్నాడీఎంకే పురుషులకు కూడా ఈ పథకాన్ని వర్తింపచేస్తామని చెప్పింది.
* ఇక విజయ్ టీవీకే పార్టీ రేషన్ కార్డు ఉన్నవారికి రూ. 2500 ఇస్తామని హమీ ఇచ్చింది.
* ఈ ఎన్నికల్లో గెలిస్తే ఉన్నత చదువులు చదివే 35 లక్షల మంది విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్‌లు పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు. రైతులకు ఉచితంగా పంప్ సెట్లు, మహిళా సంఘాలకు రూ. 5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇస్తామని డీఎంకే హామీ ఇచ్చింది.
Also Read
- Ganesh Chaturthi 2026: వినాయక చవితి సెప్టెంబర్ 14నా? 15నా? పండితులు చెప్పిన ముహూర్తం, పూజా విధానం ఇదే..
- Kanchipuram Horror: రూ.20 వేల అప్పు కోసం బాలింత నిర్బంధం.. గుడారంలోనే ప్రసవం, తల్లీబిడ్డ మృతి
- Antivenom: ఇక డోంట్ వర్నీ.. పామువిషానికి చెక్ పెట్టే సరికొత్త యాంటీవెనమ్ వచ్చేసింది!
- BRICS Summit 2026: బ్రిక్స్ సదస్సు కోసం ఢిల్లీకి చేరుకున్న పుతిన్.. నేడు మోడీతో కీలక భేటీ
ఉచితాల చరిత్ర ఇప్పటిది కాదు..
తమిళనాడులో ఉచితాల చరిత్ర కొన్ని దశాబ్ధాలతో ముడిపడి ఉంది. 1967లో సీఎన్ అన్నాదురై రూపాయికి బియ్యం ఇస్తానని హామీ ఇచ్చారు. ఆ తర్వాత డీఎంకే నేత కరుణానిధి రేషన్ కార్డ్ ఉన్నవారికి 5 కేజీల బియ్యం ఇస్తానని హామీ ఇచ్చారు. 2006లో కరుణానిధి కలర్ టీవీ ఇస్తానని ప్రకటించి సంచలనం క్రియేట్ చేశారు. కరుణానిథి ప్రత్యర్థి జయలలిత ఓటర్లకు ల్యాప్‌లాప్, మిక్సర్ గ్రైండర్లు, ఫ్యాన్లు ఇలా ఉచితాల వెల్లువ కురిపించారు. 2016లో జయలలిత ఉచిత మొబైల్ ఫోన్లు, 100 యూనిట్ల ఫ్రీ కరెంట్, మహిళలకు రాయితీపై స్కూటర్లు, పెళ్లిళ్లలో బంగారం వంటి హామీలు ఇచ్చారు.
తాజావార్తలు
-
Tragedy: ఘోర ప్రమాదం.. నిర్మాణంలో ఉన్న చర్చి పైకప్పు కూలి ముగ్గురు మృతి, 11 మందికి గాయాలు
-
AP Collectors Conference Day 2: కలెక్టర్ల సదస్సు రెండో రోజు.. ఈ-గవర్నెన్స్ నుంచి భూ పరిపాలన వరకు కీలక చర్చలు
-
Ganesh Chaturthi 2026: వినాయక చవితి సెప్టెంబర్ 14నా? 15నా? పండితులు చెప్పిన ముహూర్తం, పూజా విధానం ఇదే..
-
Logitech MX Keypad: రూ.15,999కే Logitech MX Keypad.. 9 కస్టమైజబుల్ LCD కీస్, AI టూల్స్‌కు సపోర్ట్
-
Kanchipuram Horror: రూ.20 వేల అప్పు కోసం బాలింత నిర్బంధం.. గుడారంలోనే ప్రసవం, తల్లీబిడ్డ మృతి
ట్రెండింగ్
-
7.62mm స్లిమ్ డిజైన్, 7,100mAh బ్యాటరీతో రానున్న Nubia NaviX Ultra..!
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!