Tamil Nadu Election Results: తమిళనాడులో సంచలన ఫలితాలు నమోదవుతున్నాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులుగా చేస్తూ, తమిళ స్టార్ విజయ్‌కి చెందిన టీవీకే పార్టీ ప్రభుత్వం ఏర్పాటు దిశగా దూసుకెళ్తోంది. మొత్తం 234 స్థానాలకు గానూ టీవీకే 108 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. అయితే, మ్యాజిక్ ఫిగర్ 118. అధికారం దక్కించుకోవాలంటే టీవీకే పార్టీకి మరో 10 సీట్లు కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఎన్నికల తర్వాత పొత్తుల కుదుర్చుకునే అవకాశం ఉంది.
ఇప్పుడు విజయ్ ఎవరి సాయంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారనేది ఆసక్తిగా మారింది. ప్రస్తుతం ఉన్న సమీకరణాలను బట్టి చూస్తే విజయ్ కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలతో జతకట్టే అవకాశాలు ఉన్నాయి. ఎన్నికలకు ముందు ఈ రెండు పార్టీలు కూడా డీఎంకే కూటమిలో భాగంగా ఉన్నాయి. ప్రభుత్వం ఏర్పాటుకు డీఎంకే కూటమిలోని మరికొన్ని పార్టీలు విజయ్‌తో చేతులు కలిపే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.
కాంగ్రెస్‌కు తమిళనాడులో 5 సీట్లు వచ్చే అవకాశం ఉంది. సీపీఐకి 2, సీపీఎంకు 1, డీఎండీకేకు 1, వీకేసీకి 1 సీటు దక్కే అవకాశం ఉంది. ఇవన్నీ కలిపితే 10 సీట్లు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో డీఎంకేలోని అన్ని మిత్రపక్షాలు టీవీకే గూటికి చేరొచ్చు. ఇదే కాకుండా అన్నాడీఎంకే కూటమిలోని పీఎంకే 6 స్థానాల్లో గెలిచే అవకాశం ఉంది. పీఎంకే కూడా విజయ్‌కి మద్దతు ఇచ్చిన ఆశ్చర్యపోవాల్సింది ఏం లేదు. ఎన్నికల ముందు టీవీకే, కాంగ్రెస్ మధ్య పొత్తు కుదురుతుందనే వార్తలు వచ్చాయి. రాహుల్ గాంధీ, విజయ్‌లో కొన్ని సందర్భాల్లో ఒకరిపై ఒకరు ప్రశంసలు కురిపించుకున్నారు. ఈ అన్ని పరిణామాలను చూస్తే కాంగ్రెస్‌తో విజయ్ పార్టీకి తప్పకుండా పొత్తు కుదిరే అవకాశాలే ఎక్కువ.
