CM Vijay: “పుట్టిన బిడ్డకు బంగారు ఉంగరం”.. రాష్ట్రంలో కొత్త పథకం..
- సెప్టెంబర్ 28న నవజాత శిశువుల బంగారు ఉంగరాల పథకం ప్రారంభం
- పథకాన్ని ప్రారంభించనున్న తమిళనాడు సీఎం విజయ్
- ప్రభుత్వ ఆసుపత్రుల్లో జన్మించిన శిశువులకు మాత్రమే తొలి విడతలో ప్రయోజనం
- ఒక్కో శిశువుకు 1 గ్రాము, 22 క్యారెట్ల బంగారు ఉంగరం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Vijay: తమిళనాడు ప్రభుత్వం కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. పుట్టిన బిడ్డకు ఒక గ్రాము బంగారు ఉంగారాన్ని అందించే పథకాన్ని సెప్టెంబర్ 28న సీఎం విజయ్ అధికారికంగా ప్రారంభించబోతున్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో జన్మించిన శిశువులకు తొలి విడతలో ఉంగరాలు పంపిణీ చేయనున్నారు. ‘తైమామన్ తంగా మోతిరం తిట్టం’గా ఈ పథకానికి నామకరణం చేశారు. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ముందు విజయ్ ఇచ్చిన హామీల్లో ఇది ఒకటి. ప్రభుత్వం ఆస్పత్రుల్లో జన్మించిన శిశువుకు ఒక గ్రాము బరువు ఉన్న 22 క్యారెట్ల బంగారు ఉంగరాన్ని అందించడం ఈ పథకం ఉద్దేశ్యం. ఈ పథకాన్ని సీఎం విజయ్ జన్మదినమైన జూన్ 22నుంచి అమలు చేస్తున్నారు. అంటే, జూన్ 22 నుంచి రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో జన్మించిన శిశువులకు తొలి విడతలో ఉంగరాలు అందించనున్నారు.
తొలి విడత పంపిణీ కోసం 1.28 లక్షల ఒక గ్రాము బంగారు ఉంగరాలను ప్రభుత్వం సమకూర్చింది. సెప్టెంబర్ 28 నుంచి వీటిని లబ్ధిదారులకు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతీ ఉంగరానికి ఒక సీరియన్ నెంబర్ ఉంటుందని, ట్యాంపర్ ప్రూఫ్ ప్యాకేజింగ్‌లో వీటిని అందించేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఈ పథకం పొందాలంటే తమిళనాడులో శాశ్వత నివాసితులై ఉండాలి. తమిళనాడు మెడికల్ సర్వీసెస్ కార్పొరేషన్ ద్వారా జొయాలుక్కాస్, కళ్యాణ్ జువెల్లర్స్ నుంచి ఉంగరాలు కొనుగోలు చేశారు. ఈ పథకం కోసం ప్రభుత్వం ఏడాదికి రూ. 755.83 కోట్లు కేటాయించింది. ఏడాది కాలంలో సుమారు 4.41 లక్షల ఒక గ్రాము, 22 క్యారెట్ల బంగారు ఉంగరాలను పంపిణీ చేయడానికి ఈ నిధులు ఉపయోగించనున్నారు.
Also Read
- West Bengal: మమత మద్దతు.. ఆ వెంటనే కాంగ్రెస్ అభ్యర్థి అరెస్ట్.. నందిగ్రామ్‌లో ట్విస్ట్
- Ind-Pak: మరోసారి సముద్ర వివాదం.. నౌక ఢీకొనడంపై పాక్ వాదనను ఖండించిన భారత్
- Supreme Court: పరీక్షా సంస్కరణలపై సుప్రీంకోర్టు విచారణ.. ఎన్టీఏ ఆఫీస్‌ను సందర్శించే అవకాశం
- Mamata Banerjee: అభ్యర్థి ఔట్.. కాంగ్రెస్‌కు మమత మద్దతు: బెంగాల్ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్..
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ముందు విజయ్ తనను గెలిపిస్తే, నవజాత శిశువులకు మేనమామ బంగారం బహుమతి కింద పథకాన్ని ప్రారంభిస్తానని చెప్పారు. మహాబలిపురంలో పార్టీ నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ హామీ ఇచ్చారు. తాజాగా విజయ్ సర్కార్ తన హామీని అమలు చేయబోతోంది.
తాజావార్తలు
-
CM Vijay: “పుట్టిన బిడ్డకు బంగారు ఉంగరం”.. రాష్ట్రంలో కొత్త పథకం..
-
TGPSC: నిరుద్యోగులకు శుభవార్త.. టీజీపీఎస్సీ నుంచి మరో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల..
-
Saudi-Houthi: ట్రంప్ మొండిచేయి.. హౌతీలతో రాజీ కోసం సౌదీ ఏం చేసిందంటే…!
-
Bhatti Vikramarka : ప్రాణహిత-చేవెళ్ల కడదామా? వద్దా? బీజేపీ సమాధానం చెప్పాలి
-
Sampoornesh Babu: స్టార్డమ్ ముసుగు తీసేసిన సంపూ.. తెరవెనుక అసలైన జీవితం ఇదేనట!
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..