NTV Telugu Site icon

CM Stalin: ఒక దేశం-ఒకే భాష నినాదంపై తమిళనాడు సీఎం సీరియస్

Cm Stalin

Cm Stalin

ఒక దేశం-ఒకే భాష నినాదంపై తమిళనాడు సీఎం సీరియస్ అయ్యారు. అయితే.. హిందీ భాషను బలవంతంగా రుద్దాలని కేంద్రం ప్రయత్నిస్తుందని , ఒక దేశం, ఒకే భాష, ఒకే సంస్కృతి వంటివి దేశానికి శత్రువులని, అలాంటి దుష్ట శక్తులకు దేశంలో తావులేదన్నారు. తమిళనాడులో ‘ఇండియా ఎట్ 75 మనోరమా న్యూస్ కాంక్లేవ్ 2022’ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన కేంద్ర ప్రభుత్వ వైఖరిపై విమర్శలు చేశారు. విలేఖరులను అరెస్టు చేయడం.. కేంద్ర దర్యాప్తు సంస్థలను అడ్డుపెట్టుకుని ప్రతిపక్షాలపై దాడులు చేయడం ద్వారా కేంద్రం నిరంకుశంగా ప్రవర్తిస్తోందని మండిపడ్డారు. కేంద్రం.. రాజ్యాంగం కల్పించిన హక్కులకు ఇలా భంగం కలిగేలా చేయడం తప్పని ఆగ్రహం వ్యక్తం చేసారు.

read also: COVID 19: స్వల్పంగా తగ్గిన కోవిడ్ కేసులు.. 39 మరణాలు

అయితే.. ఇది దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన యోధుల్ని మోసం చేయడమే. ఒక భాష ఎప్పుడూ జాతీయ భాష కాదని, ఒకవేళ దీన్ని బలవంతంగా అమలు చేస్తే క్రమంగా ఇతర భాషలు నాశనమవుతాయని మండిపడ్డారు స్టాలిన్‌. ఒక దేశం- ఒకే భాష ఒకే సంస్కృతి వంటివి దేశానికి శత్రువులని, వాటికి దేశంలో స్థానం లేదని అన్నారు. కాగా.. కేంద్రం ప్రభుత్వం తీసుకొస్తున్న అనేక విధానాలు ప్రజా వ్యతిరేకంగా ఉన్నాయని, బీజేపీ అధికారంలో లేని రాష్ట్రాల్లో గవర్నర్ల ద్వారా సమాంతర పాలన చేయాలని బీజేపీ భావిస్తోందని మండిపడ్డారు. మేము.. మా రాష్ట్రాల్ని పాలించుకోగలమని, ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చడమే మా లక్ష్యం అని స్టాలిన్ వ్యాఖ్యానించారు. అయితే స్టాలిన్‌ బీజేపీ పై చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.