Site icon NTV Telugu

Stalin: కరూర్‌ను ఒకలా.. మణిపూర్‌ను మరొకలా చూస్తారా? బీజేపీపై సీఎం స్టాలిన్ ఆగ్రహం

Cmstalin

Cmstalin

బీజేపీపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే.స్టాలిన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కరూర్ తొక్కిసలాట ఘటనను బీజేపీ రాజకీయంగా వాడుకోవాలని చూస్తోందంటూ ఫైరయ్యారు. ఎన్నికల్లో లబ్ధి కోసమే కరూర్ ఘటనను బీజేపీ వాడుకుంటోంది తప్ప.. తొక్కిసలాట గురించి మాత్రం ఆందోళన లేదని వ్యాఖ్యానించారు. కరూర్ ఘటన జరగగానే ఎంపీలు హడావుడిగా వచ్చారని.. మణిపూర్ అల్లర్లు జరిగినప్పుడు బీజేపీ ఎంపీలు అక్కడికి ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు.

ఇది కూడా చదవండి: CM Chandrababu: అసెంబ్లీలో బాలకృష్ణ వ్యాఖ్యలు.. పరోక్షంగా స్పందించిన సీఎం చంద్రబాబు..

కరూర్‌ తొక్కిసలాట ఘటనలో 41 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురు గాయపడ్డారు. మరోవైపు టీవీకే పార్టీ చీఫ్‌, సినీ నటుడు విజయ్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. తాను చేపట్టిన రాష్ట్రవ్యాప్త పర్యటనలు వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ చేపట్టిన రాష్ట్ర వ్యాప్త పర్యటనలను రెండు వారాల పాటు వాయిదా వేయాల్సి వచ్చింది.. కాగా, ఈ తొక్కిసలాట ఘటనపై రాజకీయ విమర్శలు కొనసాగుతున్నాయి.. విజయ్‌.. అధికార డీఎంకేపై ఆరోపణలు గుప్పిస్తుండగా.. డీఎంకే.. విజయ్‌పై కౌంటర్‌ ఎటాక్ చేస్తోంది.

ఇది కూడా చదవండి: PoK Protests: పీఓకేలో నిరసనలు.. మునీర్ సైన్యం దురాగతాలపై స్పందించిన భారత్..

Exit mobile version