CM Chandrababu: అసెంబ్లీలో బాలకృష్ణ వ్యాఖ్యలు.. పరోక్షంగా స్పందించిన సీఎం చంద్రబాబు..
- కేబినెట్ భేటీ తర్వాత వివిధ అంశాలపై మంత్రులతో సీఎం చంద్రబాబు చర్చ..
- అసెంబ్లీలో తెలిసో తెలియకో కొందరు ఎమ్మెల్యేలు ఇష్టారీతిన మాట్లాడారు..
- తమ జిల్లా పరిధిలో ఉన్న 7 మంది ఎమ్మెల్యేలను నియంత్రించాల్సిన బాధ్యత ఇంఛార్జ్ మంత్రులదే: సీఎం చంద్రబాబు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: మంత్రివర్గ సమావేశం అనంతరం వివిధ అంశాలపై మంత్రులతో సీఎం చంద్రబాబు చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అసెంబ్లీలో తెలిసో తెలియకో కొందరు ఎమ్మెల్యేలు ఇష్టారీతిన మాట్లాడారు.. తమ జిల్లా పరిధిలో ఉన్న ఏడుగురు ఎమ్మెల్యేలను నియంత్రించాల్సిన బాధ్యత ఇంఛార్జ్ మంత్రులదే.. నిరంతరం ఎమ్మెల్యేలతో ఇంఛార్జ్ మంత్రులకు రాజకీయ సమన్వయం ఉండాలని సూచించారు. శాఖా పరంగా ఎలాంటి విమర్శలు వచ్చినా గట్టిగా స్పందించాలి.. చరిత్రలో తొలిసారి 93 శాతం రిజర్వాయర్లు నీటిని నింపాం.. విజన్ 2047కు పెట్టుకున్న 10 ప్రిన్సిపల్స్ లో ఇదో కీలక పరిణామం అని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు.
Read Also: UP: సినిమా రేంజ్‌లో కాల్పులు.. హత్య దృశ్యాలు సోషల్ మీడియాలో పోస్ట్
Also Read
అయితే, చామ్ విధానంలో పట్టణాభివృద్ధి చేపట్టిన నిర్మాణాలు ఇతర శాఖలు అందిపుచ్చుకోవాలని సీఎం చంద్రబాబు తెలిపారు. పూర్వోదయ పథకంలో ఏపీకి స్థానం లభించిన విషయాలు మంత్రులతో పంచుకున్నారు. ఏ పథకం ద్వారా దాదాపు రూ. 65 వేల కోట్లు ఉద్యాన, ఆక్వా రంగాలకు వచ్చే అవకాశం ఉంది. యానిమల్ హాస్టళ్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి.. విజయవాడ ఉత్సవ్ తరహాలో నెలకో ఈవెంట్ రాష్ట్రంలో స్థానిక పండుగల్ని ప్రోత్సహించేలా అన్ని ప్రాంతాల్లో చేపట్టాలి అన్నారు. కడపలో జిందాల్ ఉక్కు పరిశ్రమ 2028కల్లా పూర్తి చేస్తాం.. కర్నూల్ లో ఈ నెల 16వ తేదీన ప్రధాని మోడీ పర్యటన విజయవంతం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
NIA Raids : ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్.. రామగుండంలో NIA మెరుపు దాడులు
-
Off The Record: ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలకు కేటీఆర్ వార్నింగ్..?
-
AP Liquor Scam Case: కారుమూరి అరెస్ట్‌పై ఈడీ కీలక ప్రకటన
-
Chairmans Desk : కాంగ్రెస్‌లో పాతకథ పునరావృతమౌతోందా.. రేవంత్ తక్షణ కర్తవ్యమేంటి..?
-
OTR: ప్రభాకర్ చౌదరి ఆరోపణలకు స్పందించని ఎమ్మెల్యే దగ్గుబాటి.. కారణం ఇదేనా..?
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్‌ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్‌డ్రా చేస్తే పెన్షన్‌పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్‌ఫోన్ కొనేముందు ఈ వాటర్‌ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!