Paternity Leave: తమిళనాడు ముఖ్యమంత్రి, టీవీకే పార్టీ అధినేత జోసెఫ్ విజయ్ గుడ్న్యూస్ చెప్పారు. పురుష ప్రభుత్వ ఉద్యోగులకు 15 రోజుల పితృత్వ సెలవు(Paternity Leave) కల్పిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బిడ్డ పుట్టే సమయంలో భార్యకు అండగా ఉంటడంతో పాటు, నవజాత శిశువుల సంరక్షణలో తండ్రి కూడా భాగస్వామి కావాలనే ఉద్దేశంతోనే నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. తమిళనాడు ప్రభుత్వంలో పనిచేస్తున్న వివాహిత పురుష ఉద్యోగులు ఈ సెలవుల్ని ఉపయోగించుకోచ్చు.
బిడ్డ పుట్టడానికి 15 రోజుల ముందు నుంచి లేదా శిశువు జన్మించిన ఆరు నెలల్లోపు ఎప్పుడైనా ఈ 15 పితృత్వ సెలవుల్ని తీసుకునే అవకాశం ఉంది. ఈ మేరకు పితృత్వ సెలవులుపై ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. తమిళనాడులో మహిళా ప్రభుత్వ ఉద్యోగులకు ప్రస్తుతం 365 రోజుల ప్రసూతి సెలవుల సౌకర్యం ఉంది. తాజాగా పురుష ఉద్యోగులకు 15 రోజుల పితృత్వ సెలవుల్ని కల్పిస్తోంది.
ప్రసవం అనేది తల్లికి, నవజాత శిశుకు ఎంతో కీలకమైన సమయం అని, ఈ సమయంలో తండ్రి అందించే మద్దతు తల్లికి శారీరకంగా, మానసికంగా ఎంతో ఉపయోగపడుతుందని ప్రభుత్వం పేర్కొంది. బిడ్డ సంరక్షణలో తండ్రి కూడా కీలకంగా పాల్గొనేందుకు ఈ సెలవువు ఉపయోగపడుతాయని చెప్పింది. పిల్లల పెంపక తల్లి ఒక్కరి బాధ్యతే కాదని, తల్లిదండ్రులు ఇద్దరూ సమానంగా బాధ్యతలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం చెప్పింది.

