Modi Tour: రేపు 108 అడుగుల హనుమాన్ విగ్రహావిష్కరణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశవ్యాప్తంగా హనుమాన్ జయంతి సందర్భంగా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. హనుమాన్ జయంతి సందర్భంగా ప్రధాని మోడీ రేపు గుజరాత్ లో పర్యటించనున్నారు. మోర్బీలో నెలకొల్పిన 108 అడుగుల భారీ హనుమాన్ విగ్రహాన్ని మోడీ ఆవిష్కరిస్తారు. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. ‘హనుమాన్జీ4ధామ్’ప్రాజెక్ట్ లో భాగంగా దేశ నలు దిక్కుల్లో నాలుగు హనుమాన్ విగ్రహాలను ప్రతిష్ఠించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే.
అందులో భాగంగా దేశానికి పడమర దిక్కున ఉన్న మోర్బీలోని బాపూ కేశ్వానంద్ ఆశ్రమంలో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు ఏర్పాటు చేసిన విగ్రహాల్లో ఇది రెండోది. మొదటి విగ్రహాన్ని 2010లో ఉత్తరాదిన ఉన్న సిమ్లాలో ఏర్పాటు చేశారు. అలాగే దక్షిణ దిక్కున తమిళనాడులోని రామేశ్వరంలో విగ్రహానికి సంబంధించిన పనులు ప్రారంభించారు.
Also Read
- Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
- UP: యూపీలో హర్యానా నటుడు అంకిత్ బలియాన్ హత్య
- Nepal-Tibet Flood: వరదల్లో చిక్కుకున్న ఇషా ఫౌండేషన్‌కు చెందిన 77 మంది భక్తులు, రంగంలోకి సద్గురు
- Nepal Floods: నేపాల్ జలప్రళయానికి ముందు భూకంపం.. 7 నిమిషాల్లోనే ఫ్లాష్ ఫ్లడ్స్!
సిమ్లాలోని జాఖూలో బిగ్-బి అమితాబ్ బచ్చన్ అల్లుడు నందా నిర్మించిన హనుమాన్ విగ్రహం ‘గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’లోనూ చోటు సంపాదించుకున్న సంగతి తెలిసిందే. ఎత్తయిన ప్రదేశంలో ఏర్పాటైన అత్యంత ఎత్తయిన విగ్రహంగా రికార్డు పొందింది. జాఖూలోని విగ్రహానికి ఎన్నో ప్రత్యేకతలు వున్నాయి. దీని కోసం మొత్తం 1500 టన్నుల కాంక్రీట్, ఇనుము, రాళ్ళు ఉపయోగించారు.
విగ్రహం స్థిరంగా ఉండేందుకు 178 అడుగుల లోతుతో పునాది వేశారు. ఇక్కడ విగ్రహం ఏర్పాటుచేయడానికి కారణం కూడా వుంది. లక్ష్మణుడు మూర్ఛ పోయినప్పుడు హనుమంతుడు ఇక్కడే విశ్రాంతి తీసుకున్నాడని చరిత్ర చెబుతోంది. అందుకే అంత భారీ విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటుచేశారు. ఇక్కడ ప్రాంతం కూడా ఎత్తుగా వుండడంతో విగ్రహం కూడా బాగా పెద్దదిగా కనిపిస్తుంది.
తాజావార్తలు
-
Dil Raju: ‘టాక్సిక్’తో దిల్ రాజుకు జాక్‌పాట్.. సినిమా రిజల్ట్ ఏదైనా ప్రాఫిటేనట! అసలు లెక్క ఇదే..
-
IND vs SL 2nd Test: అదే జరిగితే.. టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్ ఆశలు గల్లంతే!
-
Re Release : స్టార్ హీరోల ఫ్యాన్స్‌ను హర్ట్ చేస్తోన్న రీ-రిలీజ్ మూవీస్
-
10.1 అంగుళాల టచ్‌స్క్రీన్, 310 కి.మీ రేంజ్, బాక్సీ డిజైన్‌తో Suzuki e-Sky లాంచ్..!
-
Road Accident: చిలకలూరిపేటలో ఘోర ప్రమాదం.. ఏడుగురి మృతి, 8 మందికి తీవ్ర గాయాలు!
ట్రెండింగ్
-
8000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz AMOLED డిస్ప్లేతో Realme P4s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
-
165Hz డిస్‌ప్లే, 24GB RAM, 7,470mAh బ్యాటరీతో Lenovo Legion Tab Y700 AI టాబ్లెట్ లాంచ్.. ధర ఎంతంటే?
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్‌గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..