NTV Telugu Site icon

Swati Maliwal: కేజ్రీవాల్ ఇంటి దగ్గర స్వాతి మాలివాల్ హల్‌చల్.. యమునా నీళ్లతో నిరసన

Swatimaliwal

Swatimaliwal

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ ఆప్ రాజ్యసభ ఎంపీ స్వాతి మాలివాల్ మరోసారి మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఇంటి దగ్గర హల్‌చల్ చేసింది. పూర్వాంచల్‌కు చెందిన కొంతమంది మహిళలతో కలిసి యమునా నది నీళ్లు తీసుకుని కేజ్రీవాల్ ఇంటి దగ్గర నిరసన చేపట్టింది. బాటిల్స్‌తో తీసుకొచ్చిన మురికి నీళ్లు.. టబ్‌లో వేసి అనంతరం కేజ్రీవాల్ దిష్టి బొమ్మను నిమజ్జనం చేశారు. అప్రమత్తమైన పోలీసులు.. స్వాతి మాలివాల్‌ను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

ఇది కూడా చదవండి: Bathua Leaves Benefits: ఈ ఆకు గురించి మీకు తెలుసా..? ఎంత మేలు చేస్తుందో తెలిస్తే వదిలిపెట్టరు

ఈ సందర్భంగా స్వాతి మాలివాల్ మాట్లాడుతూ.. యమునా నదిని కేజ్రీవాల్ కాలువగా మార్చేశారని ధ్వజమెత్తారు. యమునా నదిలో మురికి నీళ్లు ప్రవహిస్తున్నాయని ఆరోపించారు. ప్రస్తుతం నది వెంటిలేటర్‌‌పై ఉందని ధ్వజమెత్తారు. కేజ్రీవాల్ మాత్రం రాజభవనంలో ఉండి.. విలాసవంతమైన కార్లలో తిరుగుతున్నారన్నారు. యమునా నీళ్లను కేజ్రీవాల్ తాగాలన్నారు.

గతేడాది మే నెలలో కేజ్రీవాల్‌ నివాసంలో వ్యక్తిగత కార్యదర్శి.. స్వాతి మాలివాల్‌పై భౌతిక దాడి చేశారు. అప్పటి నుంచి స్వాతి మాలివాల్-కేజ్రీవాల్ మధ్య వివాదం తలెత్తింది. ఇప్పటికే పలుమార్లు కేజ్రీవాల్ ఇంటి దగ్గర స్వాతి మాలివాల్ నిరసనలు చేపట్టారు. తాజాగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ నానా హంగామా సృష్టించారు.

ఇది కూడా చదవండి: SC Classification: ఎస్సీ వర్గీకరణపై కేబినెట్ సబ్ కమిటీ కీలక చర్చ..

ఢిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఫిబ్రవరి 5న పోలింగ్ జరగనుంది. ఎన్నికల ఫలితాలు మాత్రం ఫిబ్రవరి 8న విడుదలకానున్నాయి. ఈ సారి ఆప్, బీజేపీ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. అలాగే కాంగ్రెస్ కూడా పోటీ ఇస్తోంది. అయితే మరోసారి అధికారం కోసం ఆప్.. ఈసారి అధికారం చేజిక్కించుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తోంది.