Swati Maliwal Assault: స్వాతి మలివాల్ దాడి కేసులో వైరల్ అవుతున్న వీడియో..భద్రతా సిబ్బందితో తీవ్ర వాగ్వాదం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Swati Maliwal Assault: ఆప్ నేత, రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్‌పై దాడి వ్యవహారం దేశ రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతోంది. సీఎం అరవింద్ కేజ్రీవాల్ నివాసంలో ఆయన పీఏ బిభవ్ కుమార్ ఆమెపై దాడి చేసిన ఘటన సంచనలంగా మారింది. నిన్న ఆమె ఢిల్లీ పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు. నిందితుడిపై కేసు నమోదైంది. ఎఫ్ఐఆర్ నివేదిక ప్రకారం.. స్వాతి మలివాల్ 7-8 సార్లు కొట్టడంతో పాటు ఛాతీ, కడుపు భాగంలో తన్నడంతో పాటు సన్నితమైన శరీర భాగాలపై దాడి చేసినట్లు పేర్కొంది.
Read Also: Atrocious: భర్త, అత్తపై కోడలు అరాచకం.. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం దాడి
Also Read
- Maharashtra: ఘోర విషాదం.. జీపు బోల్తా.. నలుగురు తెలంగాణ వాసుల మృతి
- Tamil Nadu: అలాగైతే కేబినెట్ నుంచి వైదొలుగుతాం.. సీఎం విజయ్‌కు కాంగ్రెస్ వార్నింగ్.. కారణమిదేనా?
- Supreme Court: సెప్టెంబర్ 5న ఢిల్లీలో సీజేపీ నిరసన మార్చ్.. అడ్డుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరణ
- Supreme Court: కల్నల్ సోఫియా ఖురేషీపై అనుచిత వ్యాఖ్యలు.. మంత్రి క్షమాపణను తిరస్కరించిన సుప్రీంకోర్టు
ఇదిలా ఉంటే కేజ్రీవాల్ నివాసంలో భద్రతా సిబ్బందితో స్వాతి మలివాల్‌కి జరిగిన వాగ్వాదానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వెలుగులోకి వచ్చింది. ఈ వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో గార్డులకు స్వాతి మలివాల్ వార్నింగ్ ఇవ్వడం చూడొచ్చు. “తేరీ భీ నౌక్రీ ఖావుంగీ… యే గంజా సాలా” అని ఆమె చెప్పినట్లు వినవచ్చు. భద్రతా సిబ్బంది ఆమెను అక్కడ నుంచి పంపించే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తోంది. తాను పోలీసులకు ఫోన్ చేస్తానని స్వాతి మలివాల్ చెప్పడం వినొచ్చు. పోలీసులకు ఇక్కడి రారని భద్రతా సిబ్బంది చెప్పడం కనిపిస్తోంది.
వైరల్ అవుతున్న వీడియోపై మలివాల్ స్పందిస్తూ.. ‘‘తనను తాను రక్షించుకోవడానికి ‘‘రాజకీయ హిట్‌మ్యాన్’’ ప్రయత్నాలు ప్రారంభించారు. తన వ్యక్తులను ట్వీట్ చేయడం, సగం సందర్భం లేని వీడియోలను అమలు చేయడం ద్వారా అతను నేరం చేసిన తర్వాత తప్పించుకోగలనని అతను భావిస్తున్నాడు. ఒకరిన కొట్టేటప్పుడు వీడియో ఎవరు తీస్తారు..? ఒక్కసారి ఇంటిలోపల సీసీటీవీ ఫుటేజీ చూస్తే అందరికి నిజం తెలుస్తుంది’’ అని ఆమె ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.
IANS Exclusive
In visuals: Swati Maliwal assault case, incident captured on camera at Delhi CM official residence – 13th May pic.twitter.com/AIdTl1ebGO
— IANS (@ians_india) May 17, 2024
हर बार की तरह इस बार भी इस राजनीतिक हिटमैन ने ख़ुद को बचाने की कोशिशें शुरू कर दी हैं।
अपने लोगों से ट्वीट्स करवाके, आधि बिना संदर्भ की वीडियो चलाके इसे लगता है ये इस अपराध को अंजाम देके ख़ुद को बचा लेगा। कोई किसी को पीटते हुए वीडियो बनाता है भला? घर के अंदर की और कमरे की CCTV…
— Swati Maliwal (@SwatiJaiHind) May 17, 2024
తాజావార్తలు
-
Dulquer Salman: ‘ఐ యామ్ గేమ్’ కోసం నాగ్ అశ్విన్ ఎడిటింగ్..
-
Nag Ashwin : దుల్కర్ ‘ఐ యామ్ గేమ్’లో మైండ్ బ్లాంక్ అయ్యే సీక్రెట్ లీక్ చేసిన నాగ్ అశ్విన్!
-
Lionel Messi: ఫుట్‌బాల్ ప్రపంచంలో శకం సమాప్తం.. అర్జెంటీనా దిగ్గజం మెస్సీ రిటైర్మెంట్..
-
Putin: రష్యా అధ్యక్షుడు షాకింగ్ నిర్ణయం.. కాన్వాయ్ ఆపి ఫొటోలు దిగిన పుతిన్.. వీడియో వైరల్
-
CM Revanth Reddy: ఈ 1000 రోజుల్లో కేసీఆర్ ఒక్కసారైనా జనం కోసం బయటకు వచ్చారా..?: సీఎం రేవంత్‌రెడ్డి
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!