Maharashtra CM Post: సీఎం అభ్యర్థి పేరు ప్రకటన మళ్లీ వాయిదా? ఎందుకో..!
- మహారాష్ట్ర సీఎం అభ్యర్థి పేరు ప్రకటన మళ్లీ వాయిదా?
- డిసెంబర్ 4కు వాయిదా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎంపిక డైలీ సీరియల్‌గా కొనసాగుతోంది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలొచ్చి దాదాపుగా 9 రోజులైంది. కానీ ఈరోజుకి సీఎం అభ్యర్థి పేరు ప్రకటించలేదు. ఈరోజు.. రేపు అంటూ ఊరిస్తున్నారే తప్ప.. అధికారికంగా అభ్యర్థి పేరు మాత్రం ప్రకటించలేకపోతున్నారు. వాస్తవానికి మహారాష్ట్ర ప్రభుత్వ కాలం ఎప్పుడో ముగిసింది. కొత్త ప్రభుత్వం ఏర్పడడానికి కూడా మహాయుతి కూటమికి భారీ విజయం కూడా ఉంది. కానీ సీఎం పేరు అధికారికంగా ప్రకటించడానికి జంకుతున్నారు. భవిష్యత్ ముప్పును దృష్టిలో పెట్టుకుని ఏం జరగుతుందోనన్న ఆందోళనతోనే పేరు ప్రకటించేందుకు బీజేపీ హైకమాండ్ భయపడుతుందని వార్తలు వినిపిస్తున్నాయి.
ఇది కూడా చదవండి: CRDA: సీఎం అధ్యక్షతన సీఆర్డీఏ సమావేశం.. అమరావతి నిర్మాణంలో ముందడుగు..!
Also Read
- Rahul Gandhi: ‘‘రాహుల్ గాంధీ భయపడ్డారు’’.. అఖిలేష్ హామీతో రాయ్‌బరేలీలో పోటీ..
- Smit Machchhar: ‘‘ఇజ్రాయెల్, భారత్.. ప్రపంచానికే హీరో’’.. స్మిత్ మచ్చర్‌కు నెతన్యాహు భారీ గౌరవం
- Flydubai Attack: ‘‘ప్రార్థన చేస్తూ వెనక నుంచి దాడి’’.. సంచలన విషయాలు చెప్పిన స్మిత్ మచ్చర్
- Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
సోమవారం సీఎం అభ్యర్థి పేరు ప్రకటిస్తారని వార్తలు వచ్చాయి. అయితే షిండేకు అనారోగ్యం కారణంగా ముంబైలో జరగాల్సిన ఎన్డీఏ సమావేశం రద్దైంది. దీంతో సీఎం అభ్యర్థి పేరు ప్రకటన మళ్లీ వాయిదా పడింది. మరోవైపు మహారాష్ట్ర పంచాయితీ పరిష్కారం కోసం కేంద్ర పరిశీలకులుగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, గుజారాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ నియమింపబడ్డారు. ఇంకోవైపు డిసెంబర్ 5నే మహారాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం ఉంటుందని బీజేపీ ప్రకటించింది. కానీ ఇప్పటి వరకు మాత్రం పేరు ప్రకటించలేదు. తాజాగా డిసెంబర్ 4న ప్రకటించనున్నట్లు వార్తలు వినిపిస్తు్న్నాయి. ప్రమాణస్వీకారానికి ఒకరోజు ముందు పేరు ప్రకటిస్తారని బీజేపీ నేత ఒకరు మీడియాకు వెళ్లడించారు. దీంతో మరికొన్ని గంటల పాటు సస్పెన్ష్ కొనసాగనుంది. డిసెంబర్ 4వ తేదీ ఉదయం 10 గంటలకు మహారాష్ట్ర విధాన్ భవన్లో బీజేపీ శాసనసభా పక్షం సమావేశం కానుంది
ఇదిలా ఉంటే మళ్లీ తానే ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటున్నారని షిండే సన్నిహితుల దగ్గర అన్నారని సమాచారం. సామాన్యుడిగా ప్రజల సమస్యలు, బాధలను అర్థం చేసుకుని వాటి పరిష్కారానికి కృష్టి చేసినట్లు షిండే చెప్పుకొచ్చారు. అందుకోసం తిరిగి రావాలని ప్రజలు భావిస్తున్నారని షిండే చెప్పుకొచ్చినట్లు సమాచారం.
మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల్లో బీజేపీ-132, షిండే శివసేన-57, ఎన్సీపీ-41, ఉద్ధవ్ థాక్రే-20, కాంగ్రెస్-16, శరద్ పవార్-10 సీట్లు సాధించాయి. అయితే షిండే వర్గం.. మహారాష్ట్రలో కూడా బీహార్ ఫార్ములా అమలు చేయాలని డిమాండ్ చేస్తోంది. బీహార్‌లో నితీష్ కుమార్‌కు సీట్లు లేకపోయినా.. ముఖ్యమంత్రిగా ఉన్నారు. అదే సూత్రం.. మహారాష్ట్రలో కూడా అమలు చేయాలని పట్టుబడుతోంది. ఇదిలా ఉంటే తాజాగా ఎన్సీపీ నేత అజిత్ పవార్ ఢిల్లీ వెళ్లారు. ఈ పర్యటన కూడా రాజకీయంగా ఆసక్తి రేపుతోంది.
ఇది కూడా చదవండి: Renuka Chowdhury: ఎక్కువ మంది పిల్లల్ని కనాలన్న మోహన్ భగవత్ వ్యాఖ్యలపై ఆగ్రహం
తాజావార్తలు
-
Prahaar : సాలిడ్ సక్సెస్ కోసం యంగ్ హీరోపై చాలా నమ్మకం పెట్టుకున్న నిర్మాణ సంస్థ
-
Legendary Director Singeetham Srinivasa Rao : తెలుగు సినిమా ప్రమోగశాల మూతపడింది..
-
Rahul Gandhi: ‘‘రాహుల్ గాంధీ భయపడ్డారు’’.. అఖిలేష్ హామీతో రాయ్‌బరేలీలో పోటీ..
-
Oben Rorr EVO: 180KM రేంజ్.. 8 ఏళ్ల బ్యాటరీ వారంటీ.. దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ బైక్ ఇదే..!
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!