Site icon NTV Telugu

Delhi Elections: ఆప్ అంచనాలు తల్లకిందులవుతున్నాయా? దానికి కారణమిదేనా?

Kejriwal

Kejriwal

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఎవరికి గుణపాఠం నేర్పిస్తున్నాయి. ఎవరికి లాభం చేకూరుస్తున్నాయి. తేలాలంటే మరికొన్ని గంటలు ఆగాల్సిందే. హస్తినలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 60 శాతం పోలింగ్ కూడా నమోదైంది. ఇక ఫలితాలు శనివారం విడుదలకానున్నాయి. అయితే ఆప్ అంచనాలు ఈసారి తల్లకిందులవుతున్నట్లుగా సర్వేలు కోడైకూస్తున్నాయి. ఢిల్లీలో డబుల్ ఇంజిన్ సర్కార్ రాబోతున్నట్లుగా ఎగ్జిట్ పోల్స్ తేల్చేశాయి.

ఇది కూడా చదవండి: WhatsApp: త్వరలో వాట్సాప్ ద్వారా నీరు, విద్యుత్, గ్యాస్ బిల్లులు చెల్లింపులు..

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ రాకముందు నుంచే ఆప్ ప్రజల్లోకి దూసుకెళ్లింది. ఆ పార్టీ అధినేత కేజ్రీవాల్ ప్రజల్లోకి చొచ్చుకెళ్లి ఉచిత హామీలు ఇచ్చుకుంటూ వెళ్లారు. అన్ని వర్గాల ప్రజలకు తాయిలాలు ప్రకటించుకుంటూ వెళ్లారు. అయితే బీజేపీ కూడా అంతకు పైఎత్తు వేసింది. ఆప్ బాటలోనే బీజేపీ కూడా వెళ్లింది. మూడు దశలుగా మేనిఫెస్టో విడుదల చేసింది. అన్ని ఉచిత హామీలు కుమ్మరించింది. దీంతో కొంత ఓటు బ్యాంక్.. బీజేపీ వైపు డైవర్ట్ అయింది.

ఇది కూడా చదవండి: Komatireddy Venkat Reddy : దేశంలో మొట్ట మొదటి సారి కుల గణన చేసి దేశానికే ఆదర్శంగా నిలిచాం

ఇక ఢిల్లీ వాసులు కూడా మార్పు కోరుకుంటున్నారని తాజా సర్వేలను బట్టి తెలిసింది. ఇన్నాళ్లూ ఆప్ ప్రభుత్వాన్ని చూశాం కదా? ఈసారి బీజేపీకి ఓటు వేద్దామని నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఓ వైపు బీజేపీ కూడా ఉచిత హామీలు.. ఇంకోవైపు కేంద్రంలో ఎన్డీఏ సర్కార్.. మరోవైపు ప్రజలు మార్పు కోరుకోవడం.. ఇలా ఆప్‌కు ఓట్లు గండిపడ్డాయి. అంతేకాకుండా లిక్కర్ స్కామ్ కూడా పెద్ద మైనస్‌గానే చెప్పొచ్చు. అలాగే స్వాతి మాలివాల్‌పై భౌతిక దాడి జరగడం కూడా ఒక మైనస్‌గా చెప్పక తప్పదు. అందుకోసమే 49 శాతం ప్రజలు బీజేపీ వైపు మొగ్గు చూపడం వల్ల 27 ఏళ్ల తర్వాత కమలం పార్టీ అధికారంలోకి రాబోతోందని సర్వేలు అంచనా వేశాయి. ఆప్ రెండో స్థానంలో ఉండగా.. కాంగ్రెస్‌కు జీరో సీట్లు వస్తాయని సర్వేలు అంచనా వేస్తున్నాయి. అసలు ఫలితాలు తెలియాలంటే మరికొన్ని గంటలు ఆగాల్సిందే.

ఇది కూడా చదవండి: Minister Seethakka : దేశంలో ఏ రాష్ట్రం కులగణన చేయలేదు.. మనమే కులగణన చేసి చూపెట్టినం

Exit mobile version